Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్... పేరు మారింది..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రస్ అదానోమ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనాకు తాము కోవిడ్-19గా పేరును నిర్ణయించామని చెప్పారు. కోవిడ్ పూర్తి పేరు సీ- కరోనా, వి- వైరస్, డి- డిసీజ్ 201. కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్ ల సమూహాన్ని సూచిస్తుందన్నారు.

Coronavirus disease named Covid-19
Author
Hyderabad, First Published Feb 12, 2020, 7:46 AM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకేస్తోంది. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా పేరును పెట్టింది. కరోనాకు కోవిడ్-2019( covida-2019)గా నిర్ణయించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Also Read ఆ పేరు వింటేనే హోటల్‌ పరిశ్రమ వణికిపోతోంది...ఎందుకు.. ?

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రస్ అదానోమ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనాకు తాము కోవిడ్-19గా పేరును నిర్ణయించామని చెప్పారు. కోవిడ్ పూర్తి పేరు సీ- కరోనా, వి- వైరస్, డి- డిసీజ్ 2019. కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్ ల సమూహాన్ని సూచిస్తుందన్నారు. దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టామని చెప్పారు. 

ప్రజల్లో గందరగోళం కలిగించకుండా ఒకపేరు ఉండటం ముఖ్యమని చెప్పారు. అందుకే ఈ పేరు నిర్ణయించామని వెల్లడించారు. తాము కనుగొన్న పేరు ఒక భూభాగాన్ని కానీ, ఒక జంతువును గానీ, ఒక స్వతంత్ర జాతిని గానీ సూచించదన్నారు. ఈ పేరు ఆ వ్యాధిని తెలియజేస్తుందని చెప్పారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చైనాలో వెయ్యి మందికిపైగా మరణించగా... 30వేల మందికిపైగా ఈ వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios