బీజింగ్: ఇప్పటికే చైనా నిర్వాకంతో యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి బారినపడింది. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ రాకతో ప్రజల భయాందోళన కాస్త తగ్గింది. అయితే తాజాగా చైనాకు చెందిన ఓ కంపనీ తయారుచేసిన ఐస్ క్రీంలో కరోనా వైరస్ ను గుర్తించారు అధికారులు. దీంతో ఆ కంపెనీని చైనా ప్రభుత్వం సీజ్‌ చేయడమే కాదు ఇప్పటికే మార్కెట్లోకి చేరిన ఈ ఐస్ క్రీంల వల్ల ఎవ్వరికీ కరోనా సోకకుండా జాగ్రత్త పడుతున్నారు.

చైనా రాజధాని బీజింగ్ ప్రక్కనే ఉన్న టియాంజిన్‌లోని డాకియాడో ఫుడ్ కో. లిమిటెడ్‌ కంపెనీ ఐస్‌క్రీమ్‌ లను తయారు చేస్తుంటుంది. అయితే ఇటీవల ఆ కంపనీకి చెందిన ఐస్ క్రీంతో కరోనా వైరస్ ను గుర్తించారు అధికారులు. అయితే ఐస్‌క్రీమ్‌తో ఎవరికి వైరస్ బారినపడ్డట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. ఈ కంపనీలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 

కరోనా వైరస్‌ గుర్తించిన బ్యాచ్‌లో కేవలం 390 బాక్సులను మాత్రమే సదరు కంపనీ విక్రయించగా మిగతా 29వేల బాక్స్‌లు ఇంకా విక్రయించకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ కంపనీకి చెందిన ఐస్ క్రీం లను కొనుక్కున్న వారిని గుర్తించేపనిలో పడ్డారు అధికారులు.