చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణ పరిష్కరించుకోవాలి - జెలన్స్కీకి ప్రధాని మోడీ సూచన
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ టెలిఫోన్ లో మాట్లాడారు. పలు విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఘర్షణను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు.
చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణ పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీకి సూచించారు. బుధవారం ఇరువురు నేతలు టెలిఫోన్ ద్వారా సంభాషించుకున్నారు. ఈ సందర్భంగా భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై నేతలు చర్చించారు. తరువాత భారతదేశం ప్రజా కేంద్రీకృత విధానాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. సంఘర్షణ పరిష్కారానికి చర్చలు, దౌత్యమే పరిష్కారమని సూచించారు.
భారత ప్రజాస్వామ్యానికి లోక్ సభ ఎన్నికలు కీలకం.. - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తూనే ఉంటుందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ భారత దేశ ప్రజల కేంద్రీకృత విధానాన్ని పునరుద్ఘాటించారు. ఇరు పక్షాల మధ్య అన్ని సమస్యలను సత్వర, శాంతియుత పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. శాంతియుత పరిష్కారానికి భారత్ తన వంతు కృషి చేస్తూనే ఉంటుందని ప్రధాని చెప్పారు.
బీఆర్ఎస్ కు మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్..
ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజల కోసం భారతదేశం కొనసాగిస్తున్న మానవతా సహాయాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రశంసించారు. వివిధ రంగాల్లో భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరువురు నేతలు టచ్ లో ఉండేందుకు అంగీకరించారు.