పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు : విజయోత్సవ సంబరాల్లో కండోమ్‌ను పోలిన బెలూన్లు, వీడియో వైరల్

పాకిస్తాన్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనలో కండోమ్ ఆకారంలో ఉన్న బెలూన్‌లను ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మద్ధతుదారులు ఎగురవేశారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు స్పష్టంగా తెలియరానప్పటికీ.. వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Condoms Used As Balloons During Pakistan Elections 2024 Celebrations ksp

పాకిస్తాన్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనలో కండోమ్ ఆకారంలో ఉన్న బెలూన్‌లను ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మద్ధతుదారులు ఎగురవేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా ఎగురవేశారు. ఫిబ్రవరి 9, 2024న జరిగిన ఈ ప్రదర్శన ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు పాక్‌లోని ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ ఘటనకు ఆశ్చర్యం , నవ్వు, ఆగ్రహం, భయం వంటి ప్రతిస్పందనలతో కూడిన ఎమోజీలతో నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు స్పష్టంగా తెలియరానప్పటికీ.. వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇకపోతే.. రిగ్గింగ్ ఆరోపణల మధ్య పాకిస్తాన్ ఎన్నికల సంఘం కొన్ని బూత్‌లలో రీపోలింగ్ చేయాలని ఆదేశించింది.

మరోవైపు.. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. దీంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారోనన్న దానిపై గందరగోళం నెలకొంది. ఎవరికి వారు తామే విజేతలమని ప్రకటించుకుంటున్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ బలపరిచిన అభ్యర్ధుల్లో 102 మంది గెలిచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీకి ఇంకా 31 సీట్లు కావాలి. ఇక నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ 73, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లను కైవసం చేసుకుంది. 

సైన్యం మద్ధతున్న నవాజ్ షరీఫ్ పార్టీ పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు షెహబాజ్ షరీఫ్, పీపీపీ అధినేత జర్దారీతో శనివారం భేటీ అయ్యారు. నవాజ్ షరీఫ్  కోసం సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ రంగంలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios