Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. మళ్లీ ఆరు నెలలకు...


సదరు మహిళ ఫిబ్రవరి నెలలో తొలిసారి కరోనా పాజిటివ్‌గా తేలిందని అక్కడి వైద్యాధి కారులు తెలిపారు. ఆ తరువాత ఆమె కోలుకుని తన దైనందిన జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. అయితే ఇటీవల ఆమెలో మళ్లీ కరోనా వ్యాధి లక్షణాలు కనబడటంతో స్థానిక డాక్టర్లు కరోనా టెస్టుకు సూచించారు. 

Chinese woman, 68, tests Covid-19 positive after recovering in February
Author
Hyderabad, First Published Aug 13, 2020, 11:00 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే కొన్ని లక్షల మందికి సోకగా.. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఈ వైరస్ చైనాలో పుట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. అక్కడ త్వరగానే వైరస్ తగ్గుముఖం పట్టింది. కాగా.. దాదాపు.. ఆరు నెలల తర్వాత అక్కడ మళ్లీ వైరస్ విజృంభించడం గమనార్హం.

కరోనా సంక్షోభం ప్రారంభమైన తొలి నాళ్లలో ఆ వైరస్ బారినపడి కోలుకున్న ఓ వృద్ధురాలు మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు ఆరు నెలల తరువాత కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యులను, ప్రభుత్వాధికారులను ఆందోళనలోకి నెట్టేస్తున్న ఈ ఘటన చైనాలో జరిగింది. 

సదరు మహిళ ఫిబ్రవరి నెలలో తొలిసారి కరోనా పాజిటివ్‌గా తేలిందని అక్కడి వైద్యాధి కారులు తెలిపారు. ఆ తరువాత ఆమె కోలుకుని తన దైనందిన జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. అయితే ఇటీవల ఆమెలో మళ్లీ కరోనా వ్యాధి లక్షణాలు కనబడటంతో స్థానిక డాక్టర్లు కరోనా టెస్టుకు సూచించారు. 

ఇందులో ఆమె మళ్లీ కరోనా బారినపడ్డట్టు వెల్లడైంది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. కరోనా తిరగబెట్టిన కేసులు గతంలో పలుమార్లు వెలుగు చూసినప్పటికీ ఇంతకాలం తరువాత ఆ వృద్ధురాలిలో కరోనా మళ్లీ నిద్రలేవడం శాస్త్రవేత్తలను, అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 

కరోనా వచ్చితగ్గిపోయిన తర్వాత కూడా.. వైరస్ ఇంకా శరీరంలోనే ఉంటుందా అనే అనుమానలు కలుగుతున్నాయి. అదే నిజమైతే..  నిజంగా వైరస్ పూర్తిగా తగ్గిపోవడానికి మరెంత కాలం పడుతుందనే ప్రశ్నలు మొదలు మొదలౌతున్నాయి. ఆ దిశగా నిపుణులు సైతం పరిశోధనలు జరుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios