ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వారంటూ ఎవరూ లేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడే వారే. కాగా.. అన్ని స్మార్ట్ ఫోన్ లలో కెల్లా.. యాపిల్ ఐఫోన్ కి కాస్త క్రేజ్ ఎక్కువ అన్న విషయం మనందరీ తెలిసిందే. కాగా.. ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ, మధ్య తరగతి వారికి ఎప్పుడూ ఓ అందని ద్రాక్షలాంటిదే. ప్రతీ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు దానిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్యకి కొదువే లేదు.

కాగా.. గతంలో ఓ యువకుడు ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు. అలా కిడ్నీ అమ్ముకొని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ షంగ్‌కున్ కు 2011లో 17 ఏళ్లు. అప్ప‌ట్లో ఐఫోన్ 4 కొత్త‌గా విడుద‌లైంది. అయితే దాన్ని ఎలాగైనా కొనాల‌ని, త‌న స్నేహితుల‌కు చూపించాల‌ని అనుకున్నాడు. వెంట‌నే ఆన్‌లైన్‌లో అవ‌య‌వాల‌ను కొనే ముఠాతో కాంటాక్ట్ అయ్యాడు. 20వేల యువాన్ల‌కు డీల్ కుద‌ర్చుకుని ఒక కిడ్నీని అమ్మాడు. అయితే కిడ్నీ అమ్మి ఐఫోన్‌ను కొన్నాడు కానీ అత‌ని ప‌రిస్థితి ఇప్పుడు దుర్భ‌రంగా మారింది.

ఉన్న ఒక్క కిడ్నీ ద్వారా అత‌ని శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లలేదు. ఒక్క కిడ్నీపైనే భారం అంతా ప‌డింది. దీంతో కిడ్నీ ఫెయిల్ అయింది. త‌రువాత ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చాయి. అలా అత‌ను డ‌యాల‌సిస్ మీదే ఆధార ప‌డి జీవించ‌డం మొద‌లు పెట్టాడు. కానీ అత‌ని ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా త‌యారైంది. రేపో, మాపో అన్న‌ట్లు జీవిస్తున్నాడు. దీంతో అత‌ను ప‌డుతున్న బాధ వ‌ర్ణ‌నాతీతం. ఏది ఏమైనా ఐఫోన్ మోజులో ప‌డి అత‌ను కిడ్నీని అమ్ముకోవ‌డం నిజంగా విచార‌క‌రం. ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు.