Asianet News TeluguAsianet News Telugu

చైనాలో కరోనా ఉధృతిని ఎదుర్కోవడానికి ఈ కపుల్ ప్రయోగం వైరల్.. వీడియో ఇదే

చైనాలో కరోనా కేసులు ఆకస్మికంగా, అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. అక్కడ ఓ కుటుంబం ప్లాస్టిక్ కవర్‌ను తమ చుట్టూ కప్పి ఉంచేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
 

chinese couples mades plastic cover to avoid corvi 19 in a viral video
Author
First Published Dec 25, 2022, 4:17 PM IST

న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. ఒక్కరోజులో లక్షల నుంచి కోట్ల కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్ ఐసీయూలో ఫుల్‌గా నిండిపోయాయి. స్మశానాలూ నిండిపోయాయి. ఇంతటి భయానక పరిస్థితులున్న చైనాతో ఇప్పుడు ఇతర దేశాల్లోనూ కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు వైరస్ బారిన పడకుండా రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ఓ జంట ఎదుటి వారి నుంచి వైరస్ తమకు సోకకుండా ఏకంగా ఓ ప్లాస్టిక్ కవర్‌ను వారి చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.

ఓ జంట తమ చుట్టూ ప్లాస్టిక్ కవర్‌ను అమర్చుకుంది. గొడుగు నుంచి కిందికి అన్ని వైపులా ఆ కవర్‌ను పొడిగించింది. ఆ కవర్ నేల వరకు బయటి వ్యక్తుల నుంచి నేరుగా కనెక్షన్‌ను కట్ చేస్తున్నది. ఈ దంపతులు కూరగాయల మార్కెట్‌లో వెజిటేబుల్స్ కొంటూ వీడియోకు చిక్కారు. అయితే, కూరగాయలు కొనడానికి పూర్తిగా కిందికి వంగి అడుగు భాగం నుంచి చేతులు బయట పెడితే అమ్మకందారు వెజిటేబుల్స్‌ను ఆమె చేతిలో పెడుతున్నారు. డబ్బులు ఇవ్వడానికి కూడా ఇదే విధంగా కింది నుంచే భట్వాడా జరుగుతున్నది. అనంతరం ఆ కపుల్ మరో చోటికి నడిచి వెళ్లారు. అతను గొడుగును వ్యూహాత్మకంగా పట్టుకోవడంతో ఆ ప్లాస్టిక్ కవర్ వారి చుట్టూతే ఉంటున్నది.

Also Read: రామ సేతుపై బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టించింది.. క్షమాపణలు చెప్పాలి: ఛత్తీస్‌గడ్ సీఎం

కూరగాయలు కొన్న తర్వాత ఆ జంట సింపుల్‌గా మరో చోటికి వెళ్లారు. వారిని అక్కడి ప్రజలూ విచిత్రంగా ఏమీ చూడకపోవడం గమనార్హం. ఈ వీడియోను ఉమాశంకర సింగ్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి చైనాలో ఇలాంటి పద్ధతులను పాటిస్తున్నారని క్యాప్షన్ పెట్టి వీడియో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో మొదటగా పీపుల్స్ డైలీ చైనా పోస్టు చేసినట్టు తెలుస్తున్నది.

కాగా, ఈ వీడియో స్వల్ప సమయంలోనే వైరల్ అయింది. కామెంట్లూ వచ్చాయి. ఒక వేళ కరోనా వైరస్ ఆ కూరగాయలపై ఉంటే? అంటూ ఓ యూజర్ అనుమానాన్ని వ్యక్తపరిచాడు. మరొకరు.. మనకు ఇక్కడ పెళ్లిళ్లు కూడా మాస్కులు ధరించకుండానే చేసేసుకున్నారని మరొకరు పేర్కొన్నారు. వెజిటేబుల్స్ లోపటికి తీసుకునేటప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్‌ను ఎత్తినప్పుడు వైరస్ లోపలికి ప్రవేశించదా? అని ఇంకొకరు ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios