అమెరికాలో చైనా మాజీ విదేశాంగమంత్రికి వివాహేతర సంబంధం.. పదవినుంచి తొలగించి, దర్యాప్తుకు ఆదేశం..

వివాహేతర సంబంధం నేపథ్యంలో చైనా విదేశాంగమంత్రిని పదవినుంచి తొలగించారు. అమెరికాలో రాయబారిగా పనిచేస్తున్న సమయంలో ఆయన ఓ మహిళతో సంబంధం పెట్టుకుని ఓ బిడ్డకు తండ్రికూడా అయ్యారు. 

Chinas ex-foreign minister's extra-marital affair in America - bsb

న్యూయార్క్ : చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కి చెందిన ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. క్విన్ గ్యాంగ్ గతంలో అమెరికా రాయబారిగా పనిచేశారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. చైనా ఈ మధ్య ఆయనని పదవి నుంచి తొలగించింది. దానికి కారణం ఇదేనని ఆ కథనం స్పష్టం చేసింది. 

క్విన్ గ్యాంగ్  అమెరికాలో ఏర్పాటు చేసుకున్న వివాహేతర సంబంధంలో ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది. అతని సన్నిహితులు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ..  వివాహేతర సంబంధంతో అమెరికాలోక్విన్ గ్యాంగ్ ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడని తెలిపారు. దీంతో చైనా అలర్ట్ అయ్యింది..ఈ వివాహేతర సంబంధం వ్యవహారంలో క్విన్ గ్యాంగ్ దేశభద్రతనుపణంగా పెట్టాడా? అనే అంశం మీద దర్యాప్తుకు ఆదేశించింది.

'భారత్ లో పర్యటించే వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి' : ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన కెనడా

ఈ అంశం మీద దర్యాప్తు చేయడం చైనాకు పెను సవాలనే చెప్పవచ్చు.  ఎందుకంటే ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరమైన పోటీ నడుస్తోంది. క్విన్ గ్యాంగ్ ను విదేశాంగ మంత్రిగా నియమించిన ఏడు నెలలకే పదవి నుంచి తొలగించింది. అయితే ఇంత తక్కువ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. 

దీని మీద కూడా వాల్ స్ట్రీట్  జర్నల్లో.. ఇలాంటి అస్థిరమైన నిర్ణయాలతోనే జిన్ పింగ్ ప్రభుత్వం కూడుకుని ఉందని చెప్పుకొచ్చింది. చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు.. విదేశాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తులు ముమ్మరం చేసినట్లుగా వెల్లడించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios