వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిన మానవ మేధస్సుకు అంతుపట్టని ఎన్నో వింత వ్యాధులు ప్రతిరోజు పుట్టుకొస్తుంటాయి. ఎవరి మాటలు మనకు వినిపించకపోతే అది చెవుడని అర్థం. మరి మహిళలు, చిన్నారులు, ఇతర జంతువుల మాటలు వినిపించి పురుషుల మాటలు వినిపించకపోతే దానిని అరుదైన వ్యాధిగానే చెప్పుకోవాలి.

చైనాకు చెందిన చెన్ అనే మహిళ ఇటువంటి విచిత్ర వ్యాధితోనే బాధపడుతోంది. ఓ రోజు రాత్రి పడుకుని మర్నాడు లేచిన తర్వాత ఉన్నట్లుండి ఆమెకు పురుషుల గొంతు వినిపించడం మానేసింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ మాట్లాడుతుండగా తనకు వినిపించకపోవడాన్ని గమనించిన చెన్ వెంటనే వైద్యులను సంప్రదించింది.

ఆమెను పరీక్షించిన వైద్యులు చెన్‌కు అరుదైన ‘‘ రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్’’ అనే వ్యాధఇ సోకినట్లు నిర్థారించారు. దీని ఫలితంగా ఆమె హై ఫ్రీక్వెన్సీ కలిగిన శబ్ధాలను మాత్రమే వినగలుగుతోంది. చెవికి సంబంధించిన సమస్యలు ఉన్న వారిలో 13 వేల మందిలో ఒక్కరికి ఇటువంటి సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

దీనికి కారణం ఆమెకున్న మానసిక ఒత్తిడేనని అంటున్నారు. రాత్రి సమయంలో ఆమెకు చెవి బాగానే పనిచేస్తుందని, కానీ పొద్దున్న నిద్రలేచేసరికి పురుషుల మాటలను వినిలేకపోతోంది. ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమిస్తుందని తెలిపారు.