చైనా దేశం దురాగతాలు రోజు రోజుకెక్కువవుతున్నాయి. మొన్న గాల్వాన్ లోయలో 21 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న చైనా.... దురాగతాలను ఆపడం లేదు. తాజగా చైనా మరోసారి భారత్ పై విషం కక్కింది. 

కాశ్మీర్ విషయంలో చైనా పాకిస్తాన్ కు కొమ్ముకాస్తూ... భారత్ ను కవ్విస్తుంది. కాశ్మీర్ విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తాము అంగీకరించబోమంటూ మరోసారి తన దుష్టనీతిని బయటపెట్టింది. 

చైనా పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి కాశ్మీర్ లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసారు. చైనా పాకిస్థాన్ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి జరుపుతున్న చర్చల్లో భాగంగా కాశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. 

కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై చైనాకి పాకిస్తాన్ విస్తరించిందని, ఇరు దేశాల ఉమ్మడి పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. కాశ్మీర్ విషయం అనేది ఇరు దేశాలకు సంబంధించిన అంశం అని, దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఐరాస, భద్రతామండలి వంటి సంస్థల సహకారంతో పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలను చైనా వ్యతిరేకిస్తోందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.