కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా కూడా లాక్ డౌన్ లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ కి ఇంకా మందు లేకపోవడం, వాక్సిన్ కి ఇంకా సమయం పట్టనుండడంతో అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ మార్గాన్నే ఆశ్రయించాయి. ఇలా లాక్ డౌన్ లో కొనసాగుతున్నప్పటికీ... అన్ని దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఈ వైరస్ కి మందు కానీ, వాక్సిన్ కానీ కనిపెట్టే పనిలో బిజీ గా ఉన్నారు. 

తాజాగా, కరోనా వ్యాక్సిన్‌ తయారీకై జరుపుతున్న పరిశోధనల్లో చైనా మరో ముందడుగు వేసినట్టు తెలుస్తుంది. చైనా దేశానికి చెందిన ‘సినోవ్యాక్‌ బయోటెక్‌’ కంపెనీ కరోనా కట్టడికి అభివృద్ధిచేసిన ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ ‘పికో వ్యాక్‌’ను భారత్‌లోని ‘రీసెస్‌ మకాఖ్‌’ అనే జాతి కోతులపై విజయవంతంగా పరీక్షించింది. 

వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ముందు ఆ కోతుల్లో కరోనా వైర్‌సను ప్రవేశపెట్టారు. తర్వాత అవి ఇన్ఫెక్షన్‌ బారినపడ్డాయి. వాటిలో కొన్ని కోతులకు ఈ ‘పికో వ్యాక్‌’ వ్యాక్సిన్‌ను అందించగా కరోనాను కట్టడిచేసేయాంటీబాడీస్ విడుదలయ్యాయి. ఇలా యాంటీబాడీస్ విడుదలయి, అవి వైరస్ తో పోరాడడంతో....  వారం వ్యవధిలోనే కోతుల ఊపిరితిత్తుల నుంచి కరోనా వైరస్‌ జాడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కంపెనీ తెలిపింది. 

ఇకపోతే... తాజాగా కరోనా వైరస్ ను అదుపు చేయడానికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఇటలీ శాస్త్రవేత్తలు కూడా చెబుతుున్నారు. కోవిడ్ -19ను ఎదుర్కోవడానికి ప్రపంచమంతా సమరం సాగిస్తున్న వేళ కరోనా వైరస్ కాంటాక్టును తగ్గించడానికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఇటలీకి చెందన న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఎస్ఏ తెలిపింది. 

టకీస్ అనే సంస్థ కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఆ సంస్థ తెలిపింది. దాన్ని ఎలుక యాంటీ బాడీస్ నుంచి తయారు చేసినట్లు, అది మనుషులపై పనిచేయనున్నట్లు చెబుతున్నారు. దాన్ని రోమ్ లోని స్పల్లాజాని ఆస్పత్రిలో పరీక్షించినట్లు తెలిపింది. దాన్ని ఈ వేసవి తర్వాత మనుషులపై ప్రయోగించి చూడనున్నట్లు టకీస్ సీఈవో లుయిగి ఔరిసిఛియో చెప్పారు. 

వ్యాక్సిన్ ను పరీక్షించడానికి ఎలుకపై ప్రయోగించారని, ఎలుక యాంటీ బాడీస్ ను డెవలప్ చేసిందని, అది మానవ కణాలకు వైరస్ సోకకుండా అది నిరోధించగలిగిందని అన్నారు.