జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులను మరింత జటిలం చేసే ఏకపక్ష నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తామని చైనా తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు సమావేశం అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనలో ఉన్నారు. తాజాగా చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. గతంలోనూ జమ్ము కశ్మీర్ అంశంపై ఈ రెండు దేశాలు ప్రకటనలు చేశాయి. అప్పుడు కూడా భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించింది. 

న్యూఢిల్లీ: చైనా(China) ప్రభుత్వం ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. భారత్‌(India)లో వ్యతిరేకతను పుట్టిస్తున్నది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Pak PM Imrank Khan), చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(Xi jinping) సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం చైనా ఓ ఆందోళనకర ప్రకటన జారీ చేసింది. కశ్మీర్‌(Jammu kashmir) చుట్టూ పరిస్థితులను జటిలం చేసేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆ దేశం ఓ ప్రకటనలో వెల్లడించింది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాలుగు రోజుల చైనా పర్యటనలో ఉన్నారు. ఆయన చైనా ప్రముఖులతో సమావేశాలు నిర్వహించారు. చివరి రోజున ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. అనంతరం ఉభయ దేశాలు కీలక ప్రకటనలు చేశారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) పనులు మందగించడం, మరికొన్ని కీలక సమ్యలపై వీరద్దరూ మాట్లాడారు. చైనా ప్రాజెక్టుల కోసం ఆ దేశీయులు పాకిస్తాన్‌లో పనులు చేస్తున్నారు. వారిపై ఈ మధ్య తరుచూ దాడులు జరుగుతున్నాయి. ఈ అంశాలపై చర్చించడానికి వారు భేటీ అయ్యారు.

చైనా దేశం.. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నదని ఈ సమావేశంలో జీ జిన్‌పింగ్ అన్నారు. పాకిస్తాన్ దాని స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, డిగ్నిటీలను గౌరవిస్తుందని, తీవ్రవాదంపై పోరాటంలో అండగా ఉంటామని వివరించారు. సీపీఈసీ, ఇతర కీలక ప్రాజెక్టుల కోసం పాకిస్తాన్‌తో మరింత లోతుగా కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉన్నదని తెలిపారు. దక్షిణాసియాలో శాంతి సుస్థిరతలకే ఉభయ దేశాల ప్రాధాన్యత అని చెప్పారు. జమ్ము కశ్మీర్ చుట్టూ అల్లుకుని ఉన్న పరిస్థితులు, ఆందోళనలు, పాకిస్తాన్ వైఖరి ఇంకా అనేక విషయాలను జమ్ము కశ్మీర్ గురించి పాకిస్తాన్.. చైనాకు తెలిపినట్టు చైనా అధికారిక మీడియా తెలిపింది. 

జమ్ము కశ్మీర్ చర్చపై చైనా కూడా స్పందించింది. చరిత్రలో నుంచి వర్తమానం వరకు కశ్మీర్ సమస్య కొనసాగుతూనే ఉన్నదని చైనా తెలిపింది. ఈ సమస్యను ఐరాస చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, ఉభయ దేశాల ఒప్పందాలకు లోబడి ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వివరించింది. అక్కడి పరిస్థితులను మార్చేలా తీసుకునే ఏ ఏకపక్ష నిర్ణయన్ని అయినా తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నట్టు తెలిపింది.

చైనా, పాకిస్తాన్‌లు గతంలోనూ జమ్ము కశ్మీర్‌పై సంయుక్త ప్రకటనలు చేశాయి. ఆ ప్రకటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా కొట్టిపారేసింది. జమ్ము కశ్మీర్, లడాఖ్‌లు ఎప్పటిలాగే భారత అంతర్భాగంలో ఉంటాయని తెలిపారు.

కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుండయ్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా హ్యుండయ్ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యుండయ్ భారత విభాగం చెప్పుకొచ్చింది. హ్యుండయ్ పాకిస్తాన్ విభాగం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనపై భారతీయులు స్పందిస్తూ #BoycottHyundai అనే హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడంతో హ్యుండయ్ సంస్థ దిగొచ్చి క్షమాపణలు కోరింది.