Asianet News TeluguAsianet News Telugu

జిత్తుల మారి చైనా : వెనక్కి వెళ్లినట్లే వెళ్లి.. ఎల్ఏసీ వెంబడి 40 వేల సైన్యం మోహరింపు

జిత్తుల మారి చైనా తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. భారత సరిహద్దుల్లో చైనా సుమారు 40 వేల మంది సైనికులను మోహరించింది. 

China Remains In Ladakh Despite Pull Out Promise
Author
Ladakh, First Published Jul 22, 2020, 9:23 PM IST

జిత్తుల మారి చైనా తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. భారత సరిహద్దుల్లో చైనా సుమారు 40 వేల మంది సైనికులను మోహరించింది. డ్రాగన్ చర్యలను చూస్తే.. ఉద్రిక్తతలను తగ్గించే ఆలోచన ఏమాత్రం లేనట్లు అర్థమవుతోందని నిపుణులు అంటున్నారు.

వాయు రక్షణ వ్యవస్థలు, సాయుధ సిబ్బంది, సుదూర ఫిరంగి దళాలు వంటి ఆయుధాల మద్ధతున్న దాదాపు 40 వేల మంది ఎల్ఏసీ వద్ద తిష్టవేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read:లడఖ్‌లో తుపాకీ ఎక్కు పెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

దీనిని బట్టి గత వారం రెండు కార్ప్స్ కమాండర్ల మధ్య చివరి రౌండ్ చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదని అధికారులు భావిస్తున్నారు. అలాగే చైనా ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెళ్లడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఇక్కడ ఒక పరిశీలన పోస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. అందువల్ల చైనా తన శాశ్వత స్థానం సిర్జాప్‌కు వెళ్లడానికి సిద్ధంగా లేదు.

అంతేకాకుండా తూర్పు లఢఖ్‌లోని రెండు ప్రధాన ఉద్రిక్త ప్రాంతాలైన హాట్ స్ప్రింగర్స్, గోర్జా పోస్ట్ ప్రాంతాల్లో చైనా భారీగా నిర్మాణాలు చేపట్టింది. ఈ రెండు ప్రాంతాల నుంచి తాము వెనక్కి వెళ్తే భారత్ సరిహద్దు వెంబడి తమ ప్రాంతాలను ఆక్రమించే అవకాశం వుందనే సాకును ముందుకు పెడుతుంది చైనా. 
 

Follow Us:
Download App:
  • android
  • ios