Asianet News TeluguAsianet News Telugu

మా దేశంపై యుద్ధానికి చైనా కసరత్తులు చేస్తున్నది: తైవాన్ విదేశాంగ మంత్రి

చైనా.. తమ దేశాన్ని దురాక్రమించడానికి ప్రయత్నిస్తున్నదని తైవాన్ పేర్కొంది. నాన్సి పెలోసి పర్యటనను సాకుగా చూపి తమపై దాడిద చేయడానికి కసరత్తులు చేస్తున్నదని తైవాన్ విదేశాంగ మంత్రి తెలిపారు.
 

china preparing to invade taiwan says foreign minister
Author
New Delhi, First Published Aug 9, 2022, 1:58 PM IST

న్యూఢిల్లీ: తైవాన్‌ను చైనా ఆక్రమించుకో జూస్తున్నదని ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నారు. తమ దీవి దేశాన్ని దురాక్రమించుకోవడానికి చైనా కసరత్తులు చేస్తున్నదని ఆరోపించారు. తైవాన్ చుట్టూ చైనా మిలిటరీ డ్రిల్స్ చేపట్టిందని తెలిపారు. చైనాను అనుకరిస్తూనే తైవాన్ కూడా దానికి వ్యతిరేకంగా డ్రిల్స్ చేపట్టింది.

అమెరికా స్పీకర్ నాన్సి పెలోసి తైవాన్ పర్యటించిన తర్వాత చైనా కన్నెర్ర చేసింది. తైవాన్‌ తమ పొరుగు దేశం కాదని, అది తమ దేశ అంతర్భాగమని చైనా స్పష్టం చేసింది. చైనా ఎంత అభ్యంతరం చెబుతున్నా.. నాన్సి పెలోసి పర్యటించడం, తైవాను ఆమెను స్వాగతించడానికి సర్వం సిద్ధం చేయడం చైనాను రెచ్చగొట్టినట్టు అయింది. చైనా నుంచి నావికా దళం తైవాన్ వైపు ప్రయాణించడం మొదలు పెట్టగా తైవాన్ కూడా అందుకు ప్రతిఘటనగా హై అలర్ట్ ప్రకటించింది. చైనా దాడికి సిద్ధంగా సైన్యాన్ని ఉంచింది.

ఈ నేపథ్యంలోనే మంగళవారం తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ విలేకరులతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తైవాన్‌పై యుద్దానికి చైనా ఇప్పటికే మిలిటరీ డ్రిల్స్ ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. తమపై మిలిటరీ యాక్షన్ కోసం చైనా.. నాన్సి పెలోసి పర్యటనను సాకుగా చూపుతున్నదని వివరించారు. తైవాన్ రీజియన్, తైవాన్ స్ట్రెయిట్‌లో యథాతథ స్థితిని మార్చడమే చైనా అసలు ఉద్దేశం అని ఆరోపించాారు. 

తైవాన్ తీరంలో తమ మిలిటరీ డ్రిల్స్ మంగళవారం కూడా నిర్వహించినట్టు చైనా మిలిటరీ పేర్కొంది. ఈ డ్రిల్స్‌లో వైమానిక, నావికా దళాలు పాల్గొన్నాయని తెలిపింది. 

తాను ఈ వ్యవహారంపై ఆందోలన చెందడం లేదని, కానీ, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. చైనా అంతకు మించి మరేమీ చేయదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. తైవాన్‌లో ప్రజలను నైతికంగా బలహీనులు చేయడానికి చైనా మిలిటరీ ఎక్సర్‌సైజులు, క్షిపణి ప్రయోగాలు, సైబర్ దాడులు, అసత్య విషయాలను ప్రచారం చేయడం, ఆర్థిక ఒత్తిడి వంటి అనేక మార్గాల్లో చైనా తన దాడిని ఉధృతం చేసిందని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios