జెట్ విమాన రెక్కలో మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణీకులు సంఘటనా స్థలం నుండి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చైనీస్ స్టేట్ మీడియా షేర్ చేసింది. 

చాంగ్‌కింగ్ : చైనా విమానాశ్రయంలో గురువారం టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి రన్‌వే నుండి జారిపోయింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అయితే, ప్రమాదాన్ని వెంటనే గమనించడంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ “సురక్షితంగా బయటపడ్డారు” అని ఎయిర్‌లైన్స్ తెలిపింది. 113 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బందితో కూడిన విమానం నైరుతి నగరం చాంగ్‌కింగ్ నుండి టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళుతుండగా, సిబ్బంది విమానంలో ఏదో తేడా, "సస్పెండ్ టేకాఫ్" గమనించామని, అంతలోనే జెట్ రన్‌వేను నుంచి జారిపోయిందని, వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

దీంతో జెట్ లోని ప్రయాణికులు భయాందోళనకు గురై సంఘటనా స్థలం నుండి పరుగులు తీశారు. ప్రమాదానికి గురైన జెట్ రెక్కలకు మంటలు వ్యాపించినట్లు చైనా ప్రభుత్వ మీడియా షేర్ చేసిన ఫొటోల్లో కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఖాళీ చేయబడ్డారు" అని టిబెట్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. "కొంతమంది ప్రయాణీకులందరూ స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం" అని తెలిపారు. 

మార్చిలో కున్మింగ్ నుండి గ్వాంగ్‌జౌకు ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ విమానం 29,000 అడుగుల ఎత్తు నుండి పర్వత ప్రాంతంలోకి పడిపోవడంతో అందులో ఉన్న 132 మంది మరణించిన ఘటన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది చైనాలో 30 సంవత్సరాలలో జరిగిన అతి ఘోరమైన విపత్తు.

ఈ ప్రమాదంలో రెండు ఫ్లైట్ రికార్డర్‌లు లేదా "బ్లాక్ బాక్స్‌లు" దొరికాయి. చైనా ఈస్టర్న్ జెట్ అంత వేగంగా ఎలా కిందికి పడింది.. ఆ సమయంలో ఏం జరిగింది అనే దాని వెనకున్న రహస్యాన్ని చేధించడానికి యునైటెడ్ స్టేట్స్‌లో ఈ బ్లాక్ బాక్స్ లను పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో విమాన, క్యాబిన్ సిబ్బంది అర్హతలు అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా, లేదా అనే దిశగా కూడా సాగాయి.