అమెరికాలో చైనా ఫోన్లకు చెక్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్!

China Mobile faces US ban over spying fears
Highlights

మనల్ని స్పై చేస్తున్నారు, చైనా ఫోన్లను బ్యాన్ చేయండి: అమెరికా

ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనా దిగుమతుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమపై గూఢచారం చేస్తున్నారన్న నెపంతో అమెరికాలో విక్రయించబడే చైనా ఫోన్లను నిషేధించాలని అమెరికా యోచిస్తోంది.  జాతీయ భద్రతా అంశాల దృష్ట్యా అమెరికా టెలికమ్యూనికేషన్‌ మార్కెట్‌కు ఆఫర్‌ చేసే 'చైనా మొబైల్‌' సేవలను బ్లాక్‌ చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, హోంల్యాండ్ సెక్యూరిటీ, డిఫెన్స్, స్టేట్ అండ్ కామర్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసులకు సంబంధించిన ఓ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ చేసిన ప్రతిపాదనల మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. సమాచార హక్కుల చట్టంలోని సెక్షన్ ఎస్214 క్రింద సర్టిఫికెట్ కోసం, చైనా ధరఖాస్తున్న చేసుకున్న దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. తాజా నిర్ణయంతో చైనా ఇకపై అమెరికాలో మొబైల్‌ సేవలు ఆపరేట్‌ చేయడానికి వీలులేకుండా పోయింది.

అమెరికా నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ విడుదల చేసిన ప్రకటనలో ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌కు చైనా మొబైల్‌ను అనుమతించరాదని సూచించింది. ప్రస్తుతం అమెరికాలో ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ టెలికాం సంస్థల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇదే. ట్రంప్ తాజా నిర్ణయంతో చైనా-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలహీనపడే ఆస్కారం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
 

loader