చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరితీయాలని శుక్రవారం పార్లమెంట్ ఆమెదించింది. అబ్బ.. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు.. అని సంబరపడిపోకండి. ఎందకంటే ఈ నిర్ణయం తీసుకుంది మనదేశంలో కాదు.. పాకిస్తాన్ లో.

 దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ఆ దేశ  పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకించగా.. మిగతా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో మెజార్టీ ఓట్లతో పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయింది.

Also Read భార్యాబిడ్డలు సహా ఐదుగురి కాల్చివేత: నరహంతకుడి ఉరితీత...

కాగా, 2018లో నౌషెరా అనే ప్రాంతంలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన దారుణ ఘటన పాకిస్థాన్‌లో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ ఏడాదిలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు పాక్‌కు చెందిన పిల్లల హక్కుల సంస్థ ఒకటి పేర్కొంది. దీనితో మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోగా.. దీనికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ తీర్మానాన్ని ఆమోదించడంలో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరి ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమని.. శిక్షల తీవ్రతను పెంచినంత మాత్రాన నేరాలు తగ్గిపోవడని కొందరు పేర్కొనడం గమనార్హం. కాగా.. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నవారిపై కూడా ప్రజలు మండిపడుతున్నారు.