Asianet News TeluguAsianet News Telugu

ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకున్న అబ్బాయిలు.... వీడియో వైరల్...!

ఏ పెళ్లి లో అయినా... అబ్బాయిలు చీరలు కట్టుకోవడం ఎక్కడైనా చూశారా..? వినడానికి వింతగా ఉన్నా .. ఇద్దరు యువకులు తమ ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకున్నారు. 

Chicago men go viral after wearing saree for friend marriage
Author
First Published Nov 16, 2022, 3:04 PM IST

పెళ్లి అనగానే దాదాపు సంప్రదాయ వస్త్రాలు ధరిస్తారు. అమ్మాయిలు పట్టుచీరలు, లంగా ఓనీల్లో మెరిస్తే... అబ్బాయిలు కుర్తా, షేర్వానీ లాంటివి ధరిస్తారు. అయితే... ఏ పెళ్లి లో అయినా... అబ్బాయిలు చీరలు కట్టుకోవడం ఎక్కడైనా చూశారా..? వినడానికి వింతగా ఉన్నా .. ఇద్దరు యువకులు తమ ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకున్నారు. ఈ సంఘటన చికాగోలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ రోజుల్లో స్త్రీలు పురుషులు ఒకేలాంటి దుస్తులు ధరించడం సర్వసాధారణం. స్త్రీలు.. పురుషుల దుస్తులు ధరిస్తారు..  కానీ స్త్రీల దుస్తులు సాధారణంగా పురుషులు ధరించరు. ముఖ్యంగా మగవాళ్లు చీరలు, లెహంగాలు ధరించరు.అయితే అమెరికాలోని చికాగోలో జరిగిన భారతీయ జంటల పెళ్లికి వరుడి స్నేహితులు ఇద్దరు చీరల్లో వచ్చి మెరిశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 చికాగోకు చెందిన వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ అయిన Paragonfilms ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. మిచిగాన్ ఏవ్‌లో జరిగిన వివాహ వేడుకకు వరుడి సన్నిహితులు ఇద్దరు చీర కట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 

వారికి చీరలు కట్టుకోవడంలో.. ఓ మహిళ సహాయం చేయడం వీడియోలొ స్పష్టంగా కనపడుతుంది  కేవలం చీర ధరించడమే కాదు.. అమ్మాయిల్లా అందంగా.. ముఖానికి బొట్టుపెట్టుకొని రెడీ అయ్యారు. వయ్యారంగా నడుస్తూ పెళ్లి మండపంలోకి అడుగుపెట్టారు. 

ఆ యువకులను అలా చీరల్లో చూసి చాలా మంది షాకయ్యారు. వధూవరులు అయితే పడి పడి నవ్వేశారు. ఆ తర్వాత... ఆనందంగా కౌగిలించుకున్నారు. ఈ వీడియోకి నెటిజన్ల రియాక్షన్ అదిరిపోయింది. కొందరు మగవాళ్లు అయ్యిండి ఆడవారి దుస్తులు ఏంటి అని విమర్శించగా.. కొందరు మాత్రం చాలా పాజిటివ్ గా తీసుకొని ప్రశంసించడం విశేషం.

ఈ వీడియోకి ఇప్పటివరకు 55,877 లైక్‌లను మరియు 150కి పైగా కామెంట్స్ రావడం విశేషం.. సోషల్ మీడియాలో చాలా మంది పురుషులు చీరలు ధరించడాన్ని అభినందిస్తున్నారు. చాలా మంది దీనిని అద్భుతమైన ఫీట్‌గా పేర్కొన్నారు. మరికొందరు ఇద్దరూ భారతీయ జాతి దుస్తులను ధరించి వారి స్నేహితుల సంస్కృతిని మెచ్చుకున్నందుకు ప్రశంసించారు. పురుషులు ప్రతి విషయంలోనూ అందంగా కనిపిస్తారు, అబ్బాయిలు ప్లీట్స్‌తో మెరుస్తున్నారు.. అంటూ వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios