Russia Ukraine Crisis: ఉక్రెయిన్ లో చిక్కుకపోయిన భారతీయుల బాధలను వివరిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వారిని స్వదేశానికి తరలించేందుకు తక్షణమే.. చర్యలు చేపట్టాలని, అలాగే.. ప్రభుత్వం చేపట్టనున్న చర్యల వివరాలను తెలియజేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగిస్తుంది. ఓ వైపు చర్చలను సిద్దమంటునే .. ఉక్రెయిన్ నగరాల విధ్వంసాన్ని తీవ్రం చేస్తుంది. రోజురోజుకు పరిస్థితులు చేదాటుతున్నాయి. ఎటుచూసినా.. భయంకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిత్యం బాంబు దాడులతో, వైమానిక దాడులతో భయానక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన మధ్య ఎక్కడ ఆశ్రయం దొరికితే.. అక్కడ తలదాచుకుంటున్నారు ఉక్రెయిన్ దేశస్థులు.
యుద్దం విరమించుకోవాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేసిన రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. రష్యా చేస్తున్న దామనకాండను ఐక్య రాజ్యసమితి కూడా తీవ్రంగా ఖండిస్తోంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యా తన తప్పుడు నిర్ణయానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు
ఈ తరుణంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరికోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో దేశానికి తరలిస్తోంది. ఇప్పటి వరకు ఆపరేషన్ గంగా అనే కార్యక్రమంలో దాదాపు 2000 మంది దేశ పౌరులను స్వదేశానికి తరలించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఓ ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్ లో చిక్కుకపోయిన భారతీయుల బాధలను వివరిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వారిని స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం చేపట్టనున్న చర్యల వివరాలను తెలియజేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌లో భారతీయుల పరిస్థితి దారుణంగా ఉందనీ, సరిహద్దుల్లో భారతీయ విద్యార్థులను చిత్ర హింసకు గురిచేస్తున్నారు.
అమ్మాయిలనే కనికరం కూడా లేకుండా.. విక్షచన రహితంగా కొడుతున్నారు. అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా, అత్యంత గందరగోళంగా ఉంది. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం త్వరితగతిన విద్యార్థులను తరలించే ఏర్పాటు చేయాలని, హింసకు గురువుతున్న భారతీయ విద్యార్థుల కుటుంబాల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని అన్నారు.
ఉక్రెయిన్ నుండి సకాలంలో భారతీయ విద్యార్థులను తరలించలేదని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారతీయ విద్యార్థులను తరలించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారితోపాటు వారి కుటుంబాలతో తమ తరలింపు ప్రణాళికను కూడా పంచుకోవాలని అన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి తనను కలవరపెడుతున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
