Asianet News TeluguAsianet News Telugu

మాంసం, బీర్‌లో క్యాన్సర్ కలిగించే రసాయనాలు.. తాజా స్టడీలో సంచలన విషయాలు..

మనం రోజు తిసుకునే ఆహారంలో క్యాన్సర్‌కు కారణమయ్యే నైట్రోసమైన్‌లు అనే రసాయన సమ్మేళనాలు కనుగొనబడ్డాయని, అవి ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ఇటీవల హెచ్చరించింది.

Cancer causing chemicals present in meat and beer says latest Study ksm
Author
First Published Apr 10, 2023, 1:40 PM IST

మనం రోజు తిసుకునే ఆహారంలో క్యాన్సర్‌కు కారణమయ్యే నైట్రోసమైన్‌లు అనే రసాయన సమ్మేళనాలు కనుగొనబడ్డాయని, అవి ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఎఫ్ఎస్‌ఏ) ఇటీవల హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం.. 10 నైట్రోసమైన్‌లు ఉద్దేశపూర్వకంగా ఆహారంలో చేర్చబడవని.. కానీ ఆహారం తయారీ, ప్రాసెసింగ్ సమయంలో ఏర్పడతాయి. ఇవి కాన్యర్ కారకాలు, జెనోటాక్సిక్ కూడా కలిగి ఉన్నాయి. అంటే అవి DNA ను దెబ్బతీస్తాయి. మాంసం, బీర్‌లో క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉన్నాయని అధ్యయనం తెలిపింది. 

‘‘ఈయూ జనాభాలో అన్ని వయస్సుల వారిలో.. ఆహారంలో నైట్రోసమైన్‌లకు గురికావడం ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన స్థాయిని పెంచుతుందని మా అంచనా నిర్ధారించింది’’ అని ఆహార గొలుసులోని కలుషితాలపై ఈఎఫ్‌ఎస్ఏ ప్యానెల్ చైర్ డైటర్ ష్రెన్క్ అన్నారు. జంతు అధ్యయనాల ఆధారంగా.. ఎలుకలలో కాలేయ కణితుల సంభవం అత్యంత క్లిష్టమైన ఆరోగ్య ప్రభావంగా మేము పరిగణించామని ఆయన చెప్పారు.

క్యూర్డ్ మాంసం, ప్రాసెస్ చేసిన చేపలు, కోకో, బీర్, ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో సహా ఆహారాలలో నైట్రోసమైన్‌లు కనుగొనబడ్డాయని ఈఎఫ్ఎస్‌ఏ తెలిపింది. నైట్రోసమైన్‌లను బహిర్గతం చేయడానికి అత్యంత ముఖ్యమైన ఆహార సమూహం మాంసం అని పేర్కొంది.

కొన్ని ఆహార సమూహాలలో నైట్రోసమైన్‌ల ఉనికి గురించి ‘‘జ్ఞాన అంతరాలు’’ ఉన్నాయని తెలిపింది.  ఇది నైట్రోసమైన్‌ల వినియోగాన్ని తగ్గించడానికి అనేక రకాల ఆహారాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని సూచించింది. ఈఎఫ్‌ఎస్ఏ తన అభిప్రాయాన్ని యూరోపియన్ కమీషన్.. ఈయూ ఎగ్జిక్యూటివ్ ఆర్మ్తో పంచుకోనున్నట్లు తెలిపింది. ఇది 27 మంది సభ్యుల కూటమిలోని దేశాలతో సంభావ్య ప్రమాద నిర్వాహణ చర్యల గురించి చర్చిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios