జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ తమ 18 సంవత్సరాల వివాహబందానికి ముగింపు పలకనున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
నడా : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, అతని భార్య సోఫీ విడిపోబోతున్నారని.. దీనికి సంబంధించిన చట్టపరమైన ఒప్పందంపై సంతకాలు చేశారని అతని కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ జంట 18 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలకనున్నట్టు తెలస్తోంది.
"విడిపోవాలనే వారి నిర్ణయానికి సంబంధించి అన్ని చట్టపరమైన, నైతిక చర్యలు తీసుకున్నారు. దీన్ని నిర్ధారించడానికి చేయాల్సిన పనులన్నీ వారు చేసారు. ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది.
ట్రూడో వయసు 51, అతని బార్య సోఫీ వయసు 48. వీరిద్దరూ 2005 మే నెల చివరిలో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రకటనలో ఇంకా ఇలా పేర్కొన్నారు. "సోఫీ, ట్రూడోలు సన్నిహిత కుటుంబంగా ఉన్నారు. వారిద్దరూ తమ పిల్లలను సురక్షితమైన, ప్రేమపూర్వక, కొలాబరేటివ్ వాతావరణంలో పెంచడంపై దృష్టి పెట్టారు" "వచ్చే వారం నుండి ఈ ఫ్యామిలీ అంతా కలిసి సెలవులకు వెళ్లబోతున్నారు’’ అని ప్రకటన పేర్కొంది.
