Asianet News TeluguAsianet News Telugu

సింగర్ లాగా కనిపించాలని 12 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న నటుడు.. ఇన్ఫెక్షన్ తో 22 ఏళ్లకే మృతి

ఓ పాప్ సింగర్ లాగా కనిపించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న యువ నటుడు ఇన్ఫెక్షన్ తో మరణించాడు. అయితే అతడు ఇంత వరకు 12 సర్జరీలు చేయించుకున్నాడు. వాటి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాడు. 

Canadian actor Saint Van Colucci, who underwent 12 plastic surgeries to look like a singer, died of infection at the age of 22..ISR
Author
First Published Apr 25, 2023, 12:56 PM IST

సినీరంగంలో ఇప్పుడు సర్జరీల క్రేజ్ నడుస్తోంది. అందంగా కనిపించాలని, తెరపై మెరిసిపోవాలనే ఉద్దేశంతో ముఖంపై, ఇతర అవయవాలపై ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి అనేక మంది సర్జరీలు చేయించుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు ఈ సర్జరీలు వికటిస్తున్నాయి. ఇలా వికటించి ప్రాణాల మీదకి వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ కెనడియన్ నటుడు ఇలా సర్జరీలు చేయించుకొని 22 ఏళ్ల వయస్సులోనే మరణించారు.

కె-పాప్ సూపర్ బ్యాండ్ బీటీఎస్ సింగర్ లాగా  కనిపించడానికి 12 శస్త్రచికిత్సలు చేయించుకున్న కెనడియన్ నటుడు సెయింట్ వాన్ కొలూచి చిన్న వయస్సులోనే (22) కన్నుమూశారు. ఆయన కొన్ని నెలల క్రితం తీసుకున్న కాస్మెటిక్ సర్జరీల సమస్యలతో గత ఆదివారం ఉదయం దక్షిణ కొరియా హాస్పిటల్ లో మరణించారని aceshowbiz.com తెలిపింది.

ఆ వెబ్ సైట్ కథనం ప్రకారం.. వాన్ కొలూచీ 12 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. దీని కోసం ఆయన 220,000 డాలర్లు ఖర్చు చేశాడు. అయితే అతడు యూఎస్ స్ట్రీమింగ్ నెట్వర్క్ కోసం కె-పాప్ సింగర్ పాత్రను పోషించేందుకు తన దవడలోని ఇంప్లాంట్లను తొలగించడానికి శనివారం రాత్రి సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఇంప్లాంట్ల నుంచి ఇన్ఫెక్షన్ సోకింది. దీని కోసం అతడు ఇంజెక్షన్లు తీసుకున్నాడు. అయినప్పటికీ కొన్ని గంటల వ్యవధిలోనే అతడు మరణించాడు. 

‘‘ఇది చాలా విషాదకరమైనది. చాలా దురదృష్టకరమైనది’’ అని 2022 మార్చి నుంచి యువ నటుడితో కలిసి పనిచేస్తున్నబ్లేక్ అన్నారు. వాన్ కొలూచీ  6 అడుగుల ఎత్తు, 182 పౌండ్ల బరువు, ముదురు బంగారు జుట్టు, నీలి రంగు కళ్లతో  ఉండేవాడని తెలిపారు. అయినా అతడు తన లుక్స్ గురించి చాలా అభద్రతా భావానికి లోనయ్యాడని చెప్పారు. అతడికి చతురస్రాకార దవడ, గడ్డం ఉండేదని పేర్కొన్నాడు. ఇది చాలా మంది ఆసియన్లకు ఉండే ఆకారమే అయినా.. అతడి నచ్చలేదని తెలిపారు. 

వాన్ కొలూచీకి గత ఏడాది కాలంలో దవడ శస్త్రచికిత్స, ఇంప్లాంట్లు, ఫేస్ లిఫ్ట్, ముక్కు పని, కంటి లిఫ్ట్, కనుబొమ్మ లిఫ్ట్, పెదవి తగ్గింపుతో పాటు మొత్తంగా 12 సర్జరీలు జరిగాయని ఆయన తెలిపారు. దవడ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ఎంత ప్రమాదకరమో వాన్ కొలూచికి తెలుసని అన్నారు. కానీ ఆయన ఆ సర్జరీ చేయించుకునేందుకు మొగ్గు చూపాడని చెప్పారు. కాగా.. కొరియన్ డ్రామా 'ప్రెటీ లైస్' చిత్రీకరణను జూన్ లో ప్రారంభించిన వాన్ కొలూచీ డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేశారు. అంతర్జాతీయ విద్యార్థిగా ప్రధాన పాత్రల్లో ఒకటిగా నటించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios