ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య.. భారత్‌పై కెనడా ఆరోపణలు.. దౌత్యవేత్త తొలగింపు..

ఇటీవల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ పలు కేసులు మోపింది. అయితే.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ఆరోపిస్తోంది.  

Canada expels Indian diplomat over killing of Khalistani terrorist KRJ

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి వ్యవహారం వేడెక్కుతోంది. కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను తొలగించింది. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించినట్లు ఏపీ వార్తా సంస్థ వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉండొచ్చని ఆరోపణలు వచ్చాయి. కెనడా ప్రభుత్వం సోమవారం ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించినట్లు సమాచారం ఇస్తూ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. కెనడా ఆ సమయంలో భారత దౌత్యవేత్తను బహిష్కరించే చర్య తీసుకుంది. 

ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశానికి ప్రమేయం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. భారత ప్రభుత్వానికి , ఖలిస్తానీ టెర్రరిస్టు హత్యకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆ దేశ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. దీని పర్యవసానంగా.. కెనడాలోని భారత ఇంటెలిజెన్స్ అధిపతిని బహిష్కరించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. " ఈ ఆరోపణ నిజమని రుజువైతే.. ఇది మన సార్వభౌమాధికారానికి , దేశాలు ఒకదానితో ఒకటి ఎలా వ్యవహరిస్తాయి అనే అత్యంత ప్రాథమిక నియమానికి గొప్ప ఉల్లంఘన అవుతుంది" అని జోలీ చెప్పారు. ఈ క్రమంలో తాము అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించామని జోలీ చెప్పారు.

ఒట్టావాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఏజెంట్ల మధ్య సంభావ్య సంబంధం, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి కెనడా భద్రతా ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. జీ20 సమ్మిట్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ట్రూడో తెలిపారు.  హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశాన్ని నిలదీశారు.

హర్దీప్ సింగ్ హత్య వెనుక భారత ఏజెన్సీలు ఉన్నాయా అనే దానిపై కెనడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని పీఎం ట్రూడో పేర్కొన్నారు. కెనడాలో తన పౌరులలో ఒకరి హత్యలో మరొక దేశం లేదా ప్రభుత్వం ప్రమేయాన్ని అంగీకరించలేమని ఆయన నొక్కి చెప్పారు. ఇది కాకుండా.. ఈ విషయంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు సహకరించాలని ట్రూడో భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఇండో-కెనడియన్ కమ్యూనిటీకి చెందిన కొందరు కోపంగా లేదా భయాందోళనకు గురవుతున్నారని తనకు తెలుసునని ట్రూడో చెప్పాడు.కెనడా ప్రధాన మంత్రి ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రజా భద్రత మంత్రి డొమినిక్ లెబ్లాంక్ మాట్లాడుతూ కెనడా జాతీయ భద్రతా సలహాదారు, కెనడా గూఢచారి విభాగం అధిపతి తమ సహచరులను కలవడానికి , ఆరోపణలతో భారత గూఢచార సంస్థలను ఎదుర్కోవడానికి భారతదేశానికి వెళ్లారని చెప్పారు. హత్య విచారణ వేగంగా జరుతుందని  పేర్కొన్నాడు.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య 

భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను జూన్ 18న కెనడాలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ పలు కేసులు మోపింది.  పంజాబ్‌లోని జలంధర్‌లోని భర్సింగ్‌పూర్ గ్రామానికి చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్. ఖలిస్థాన్ నాయకుడిని పరారీలో ఉన్న వ్యక్తిగా ఎన్ఐఏ ప్రకటించింది. 2022లో పంజాబ్‌లోని జలంధర్‌లో హిందూ పూజారిని కాల్చిచంపిన కేసు నమోదు చేయడంతో పాటు ఆయన్ను పట్టించిన వారికి  రూ.10 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios