Asianet News TeluguAsianet News Telugu

సీరియల్ కిల్లర్ : నటిని దారుణం 47సార్లు పొడిచి చంపి.. మరొకరిపై హత్యాయత్నం.. ఉరిశిక్ష !

నిందితుడు మైకేల్ హాలీవుడ్ నటి ఆష్లే షెర్లిన్ తో పాటు మరో మహిళ మరియా బ్రూనోను దారుణంగా హత్య చేయడమే కాక మరో స్త్రీపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాలీవుడ్ ‘హాలీవుడ్ రిప్పర్’గా పిలిచే మైఖేల్ 2001, ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఆష్లే షెర్లిన్ (22)నివాసంలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపాడు

California : serial killer known as the 'Hollywood Ripper' sentenced to death - bsb
Author
Hyderabad, First Published Jul 19, 2021, 11:18 AM IST

కాలిఫోర్నియా : ప్రముఖ హాలీవుడ్ నటి ఆష్లే షెర్లిన్ తో పాటు మరో మహిళను హత్య చేసినందుకు గాను ‘హాలీవుడ్ రిప్పర్’గా ప్రసిద్ధి చెందిన మైఖేల్ గార్గిలోకు లాస్ ఏంజిల్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ నేరాలతో పాటు మరో హత్యాయత్నం కేసులో 2019 లోనే మైఖేల్ దోషిగా తేలాడు. ఈ క్రమంలో కోర్టు 2021, జూలైలో అతడికి మరణ శిక్ష విధించింది.

నిందితుడు మైకేల్ హాలీవుడ్ నటి ఆష్లే షెర్లిన్ తో పాటు మరో మహిళ మరియా బ్రూనోను దారుణంగా హత్య చేయడమే కాక మరో స్త్రీపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాలీవుడ్ ‘హాలీవుడ్ రిప్పర్’గా పిలిచే మైఖేల్ 2001, ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఆష్లే షెర్లిన్ (22)నివాసంలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపాడు. 

ఆమె శరీరంపై 47 కత్తిపోట్లు ఉన్నాయి.  హత్యకు గురైన నాటి రాత్రి ఆష్లే, తన సహనటుడు ఆస్టన్ కుచర్‌తో డేట్‌కు వెళ్లాల్సి ఉంది. ఎల్లెరిన్ కోసం హాలీవుడ్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన నటుడు కుచర్ తలుపు తట్టినా  ఆమెతీయలేదు. కిటికీలోంచి ఆయన చూడగానే నేలపై ఏదో పడినట్లు కనిపించింది. వైన్ పడి ఉంటుందని భావించి కుచర్‌ వెళ్లిపోయాడు.

ఆ మరుసటి రోజు ఎల్లరిన్ శవాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో నటుడు కుచర్ ఈ కేసులో ముఖ్య సాక్షి గా మారాడు. ఆ తర్వాత మైఖేల్ 2005లో మారియా బ్రూనో (32) అనే మహిళను దారుణంగా హత్య చేశాడు.  బ్రూనో హత్య జరిగిన మూడేళ్ళ తర్వాత అనగా 2008,  జూన్ లో మైకేల్ మరో మహిళ మిషెల్లె మర్ఫీపైన దాడి చేశాడు ఆమె ఇంట్లో ప్రవేశించి కత్తితో దాడి చేసి హత్య చేయాలని భావించాడు.

కీచక పోలీసు.. చిన్నారులే లక్ష్యం.. చివరకు..!

కానీ,  అదృష్టవశాత్తు మర్ఫీ తప్పించుకున్నారు.  అనంతరం మర్ఫీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైకేల్ నేరాలు వెలుగుచూశాయి. ఇక మర్ఫీపై దాడి తర్వాత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ సంఘటనా స్థలంలో  మైకేల్   రక్తం ఉండడంతో దాని ఆధారంగా శాంటమోనికా పోలీసులు మర్ఫీని అరెస్టు చేశారు. మర్ఫీ ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు.

రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాలు ఎదుర్కొన్న మైకేల్ విచారణ సందర్భంగా తాను అమాయకుడిని కోర్టుకు తెలిపేవాడు. లాస్ ఏంజిల్స్ లోని ఓ న్యాయస్థానం ఈ కేసులకు సంబంధించి మైఖెల్‌కు మరణశిక్ష విధించింది. కాకపోతే ఈ శిక్ష అమలు చేయడానికి వీలు లేదు. 

ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2019 నుంచి మరణశిక్షల అమలు పై నిషేధం ఉంది. 2006 తర్వాత కాలిఫోర్నియాలో మరణ శిక్షలు అమలు కాలేదు. మరోవైపు 1993 లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపిన కేసులోనూ మైకేల్ ముద్దాయిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఇల్లినాయిస్లో ఈ కేసు విచారణ జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios