అదృష్టం అంటే ఈ బస్సు డ్రైవర్ దే.. లాటరీలో దక్కిన పది కోట్లు!
ఊహించని అదృష్టం అతన్ని వరించింది. ఏకంగా రూ.10కోట్లు అతనికి అందాయి. దీంతో.. అతని అదృష్టానికి అందరూ మురిసిపోతున్నారు.

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అదృష్ట లక్ష్మి చెప్పకుండానే వచ్చేస్తుంది. అలాంటప్పుడే జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.ఓ బస్సు డ్రైవర్ జీవితంలోనూ అదే జరిగింది. రాత్రికి రాత్రే అతని దశ మారిపోయింది. ఊహించని అదృష్టం అతన్ని వరించింది. ఏకంగా రూ.10కోట్లు అతనికి అందాయి. దీంతో.. అతని అదృష్టానికి అందరూ మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో సారాంశం ఇలా ఉంది.
ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 51 ఏళ్ల స్టీవ్ గుడ్విన్ అనే వ్యక్తి.. స్థానికంగా బస్సు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో చాలా ఇబ్బందులు పుడుతూ ఉండేవాడు. రోజూ లాగే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్లాడు. చాలా సేపు డ్రైవింగ్ చేయడంతో చిరాకు పుట్టి.. టీ తాగేందుకని ఓ షాపులోకి వెళ్లాడు. టీ ఇవ్వడానికి సమయం పడుతుంది అని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న లాటరీ టికెట్ కొన్నాడు. ఒక్క టికెట్ కదా కొంటే ఏం పోతుంది లే అని కొన్నాడు.
లాటరీ టికెట్‌పై స్క్రాచ్ చేసి చూడగా 73 నంబర్ కనిపించింది. అది తన లక్కీ నంబర్ అని తెలుసుకుని ఎంతో సంతోషించాడు. అయితే కొన్ని గంటల్లోనే ఆ నంబర్‌కు 1మిలియన్ పౌండ్ల (సుమారు రూ.10.25కోట్లు) లాటరీ తగిలిందని తెలుసుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ డబ్బుతో తన అప్పులు మొత్తం తీర్చేసుకుంటానని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అతని కథ తెలిసి అందరూ అతని అదృష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.