కుప్పకూలిన బిల్డింగ్.. 11 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి
Islamabad: ఇస్లామాబాద్ లో భవనం కూలిన ఘటనలో 11 మంది నిర్మాణ కార్మికులు మృతి చెందారు. గాయపడిన ఆరుగురిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. వీరు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.

Building Construction Workers: భవనం కూలిన ఘటనలో 11 మంది నిర్మాణ కార్మికులు మృతి చెందారు. గాయపడిన ఆరుగురిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. వీరు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. పాకిస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ వర్షాల కారణంగా భవనం ఒక భాగం కూలి 11 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన ఈ భవనం పెషావర్ రోడ్ ప్రాంతంలో ఉంది. శిథిలాల నుంచి 11 మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక ఎస్పీ ఖాన్ జెబ్ ధృవీకరించారు.
గాయపడిన ఆరుగురిని పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అండర్ పాస్ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుల గుడారంపై ఒక భాగం కూలి పడిందని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఇర్ఫాన్ నవాజ్ మెమన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారనీ, ఆయన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు రేడియో పాకిస్థాన్ తెలిపింది. కాగా, గత నెల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశ మధ్య ప్రాంతం రోజుల తరబడి వరద పరిస్థితిని ఎదుర్కొంటోంది.