Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ వేసుకోనున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్

బ్రిటన్ రాణి ఎలిజబెత్ త్వరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకోనుంది.  ఫైజర్-బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు బ్రిటన్ సర్కార్ ఆమోదం తెలిపింది.

Britains Queen Elizabeth To Get Covid-19 Vaccine In Weeks": Reports lns
Author
London, First Published Dec 6, 2020, 10:14 AM IST

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ త్వరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకోనుంది.  ఫైజర్-బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు బ్రిటన్ సర్కార్ ఆమోదం తెలిపింది.

బ్రిటన్ రాణి ఎలిజబెత్ తో పాటు ఆమె భర్త ప్రిన్స్ పిలిప్ కూడా టీకా తీసుకొంటారని సమాచారం. ఈ విషయాన్ని బకింగ్ హామ్ రాజభవనం అధికారులు ప్రకటించారు.  వ్యాక్సిన్ తీసుకొన్న విషయాన్ని బ్రిటన్ రాణి ప్రకటించే అవకాశం ఉందని కూడా వారు తెలిపారు.

also read:ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఆమోదం: వచ్చే వారం నుండి ప్రజలకు టీకా

ఈ వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు గాను  బ్రిటన్ రాజకుటుంబం ఈ వ్యాక్సిన్ ను తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.ఈ వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం అత్యవసర అనుమతిని ఇచ్చింది. 80 ఏళ్ల దాటిన వారికి ఆరోగ్య సిబ్బందికి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తొలుత ఈ టీకాను అందించనున్నారు.

వ్యాక్సిన్ అభివృద్ధిపై  ప్రిన్స్ విలియమ్స్ ప్రత్యేక శద్ర్ద వహించారు. ఆక్స్‌ఫర్డ్  విశ్వవిద్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి టీకా తయారీని పరిశీలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios