లండన్: కరోనా వ్యాక్సిన్ పై  ముందడుగు పడింది. ఫైజర్ వ్యాక్సిన్ పై బ్రిటన్ కీలక ప్రకటన చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ నెల 7వ తేదీ నుండి ప్రజలకు ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వైద్య సిబ్బందికి 80 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ను అందివ్వనున్నారు.

బ్రిటన్ లో కొద్ది రోజుల్లోనే ఇమ్యూనైజేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టుగా  అధికారులు తెలిపారు. యూకే ప్రభుత్వం 40 మిలియన్ వ్యాక్సిన్ ను ఆర్డర్ చేసింది. 20 మిలియన్ టీకా సరిపోతోంది. అయితే ఒక్కొక్కరికి రెండు డోస్ లు వేయాల్సి ఉంటుంది. 

రాబోయే రోజుల్లో మొదటి మోతారు యూకేకి రానుంది. తొలి విడతలో 10 మిలియన్లు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది.యూకేలో వచ్చే వారం నుండి కరోనా వ్యాక్సిన్ వేయడానికి సిద్దంగా ఉన్నామని ఆరోగ్య కార్యదర్శి హాన్కాక్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైనా ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని  నిపుణులు సూచించారు.భౌతిక దూరం పాటించడంతో పాటు ఫేస్ మాస్కులను పెట్టుకోవాలని నిపుణులు కోరారు.