ఇటలీలో జరిగిన ఓ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 250 హీలియం బెలూన్లను కుర్చీకి కట్టి... అందులో పెళ్లికూతురును కూర్చోబెట్టి గాల్లోకి ఎగరేశారు.  

గతంలో పెళ్లంటే పెద్దల సమక్షంలో మూడు ముళ్లు వేయించి తంతు ముగించేవారు. కానీ ఇప్పుడు యువతీ యువకుల అభిప్రాయాలు, ప్లాన్లు మారిపోతున్నాయి. యుక్త వయసు రాగానే తమ పెళ్లిళ్లు ఇలా జరగాలంటూ కలలు కంటున్నారు. దీనికి తోడు మెహందీ ఫంక్షన్, సంగీత్ , ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా రకరకాల ఈవెంట్స్ భారతీయ వివాహ వ్యవస్థలోకి చొచ్చుకొచ్చాయి. అంతేకాదు తమ పెళ్లికి ఏదో ఒక స్పెషాలిటీ వుండాలని వధువరూలిద్దరూ కోరుకుంటున్నారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. గాల్లో తాళి కట్టేవారు కొందరైతే... నీటి అడుగున మూడు ముళ్లు వేసేవారు ఇంకొందరు. 

పెళ్లిళ్లు సంబంధించి సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక ఉదంతం వైరల్‌గా మారుతుంటుంది. అయితే ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన ఒక క్లిప్ వివిధ సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తోంది. పెళ్లయిన తర్వాత ఇలా జరగడం మునుపెన్నడూ చూసివుండరు. తాజాగా ఒక వీడియోలో కుర్చీకి బెలూన్లు కట్టి... దానిలో పెళ్లికూతురును కూర్చోబెట్టారు. అంతే కొద్దిక్షణాల్లోనే పెళ్లికూతురు గాల్లో ఎగురుతూ వచ్చి వివాహ వేదికకు చేరుకుంది. 

ఇటలీలోని జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ ప్లానర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇప్పటి వరకు దీనిని 4 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. అన్నట్లు వధువు ఈ పెళ్లికి ధరించిన వజ్రాలు పొదిగిన తలపాగా కూడా చూపరులను ఆకర్షిస్తోంది. ఆమెను గాల్లోకి లేపడానికి దాదాపు 250 హీలియం బెలూన్లను ఉపయోగించారట. సో.. అదన్న మాట విషయం. 

View post on Instagram