బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్ వింగ్ వర్కర్స్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఘనవిజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై ఆయన విజయం సాధించారు. బ్రెజిల్ ఎన్నికల అధికారులను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ ఈ వార్తను నివేదించింది.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. వామపక్ష అభ్యర్థి,మాజీ అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి అధికారం చేపట్టబోతున్నారు.లూలా యొక్క ఆశ్చర్యకరమైన పునరాగమనం దేశంలోని మితవాద ప్రభుత్వాన్ని అంతం చేసింది. ఒక దశాబ్దం తరువాత, బోల్సోనారో యొక్క 49.2 శాతంతో పోలిస్తే లూలా 50.8 శాతం ఓట్లతో ఎన్నికల్లో విజయం సాధించారు. చాలా పోల్స్ కూడా లూలా తిరిగి అధికారంలోకి రానున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి.
