ఈ విచారణలో దంపతుల ఐదుగురు పిల్లలు, మనవరాలు కూడా నిందితులుగా ఉన్నారు. సొంత పిల్లలతో పాటు, దత్తత పిల్లల్లో కొందరికి కూడా శిక్ష పడింది.
రియో డి జెనీరో : 2019లో తన భర్తను హత్య చేసిన కేసులో బ్రెజిల్ మాజీ కాంగ్రెస్ మహిళ ఫ్లోర్డెలిస్ డాస్ శాంటోస్‌కు ఆదివారం 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రియో డి జెనీరో కోర్టు తీర్పునిచ్చింది.
డాస్ శాంటోస్, 61, ఆమె భర్త, పాస్టర్ ఆండర్సన్ డో కార్మో రియో డి జెనీరో మురికివాడల నుండి డజన్ల కొద్దీ వీధి పిల్లలను దత్తత తీసుకోవడంలో ప్రసిద్ధి చెందారు. ఈ జంట బ్రెజిల్‌లో అభివృద్ధి చెందుతున్న ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఉద్యమంలో పవర్ కపుల్ గా ఉన్నారు. ఆండర్సన్ డో కార్మో 2019 జూన్ లో రియో సబర్బ్ లోని తమ ఇంట్లో విరుచుకుపడ్డ బుల్లెట్ల వర్షంలో చిక్కుకుని తుదిశ్వాస విడిచాడు.
ప్రాసిక్యూటర్లు ఆగస్ట్ 2020లో డాస్ శాంటోస్‌పై "మనిషిని హత్యచేయడంతో పాటు దానిని సాయుధ దోపిడీగా మరుగుపరచడానికి ప్రయత్నించడం మీద అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేరంలో ఆమె ఎదిగిన పిల్లలలో చాలా మంది పాల్గొనారు.
దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి.. 35 ముక్కలుగా కోసి, నగరమంతా చల్లి...
ఆర్థిక వ్యవహారాలపై ఎవరు అధికారం అనే విషయంలో గొడవల వల్లే అనుమానాస్పద హత్య జరిగిందని అంటున్నారు. ఆస్తి మీద తన అధికారం కోసం 42 ఏళ్ల డో కార్మో దారుణంగా వ్యవహరించారని న్యాయవాదులు తెలిపారు. అయితే పార్లమెంటరీ మెంబర్ కావడం వల్ల ఆమె పార్లమెంటరీ ఇమ్యూనిటీతో రక్షించబడింది. అయితే ఆగస్టు 2021లో ఆమె సహచరులు ఏకగ్రీవ ఓటుతో ఆమెను తొలగించడంతో ఇమ్యూనిటీ కోల్పోయింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ ఫిర్యాదు ప్రకారం, మాజీ కాంగ్రెస్ మహిళ తన భర్తను గతంలో కనీసం ఆరు సందర్భాలలో విషంతో చంపడానికి ప్రయత్నించినందుకు, అలాగే పత్రాల ఫోర్జరీ, ఆర్మ్ డ్ క్రిమినల్ అసోసియేషన్ లలో కూడా దోషిగా తేలింది. 2018లో కన్జర్వేటివ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరపున డోస్ శాంటోస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. జాకరెజిన్హోలోని రియో ఫవేలా మురికివాడలో జన్మించిన ఆమె 1994లో దో కార్మోను కలుసుకుంది.
వారిద్దరూ కలిసి కమ్యూనిటీ ఆఫ్ ఎవాంజెలికల్ మినిస్ట్రీ ఫ్లోర్డెలిస్ అనే సంస్థను స్థాపించారు. ఈ దంపతుల ఐదుగురు పిల్లలతో పాటు, వారి మనవరాలు కూడా నిందితులుగా విచారణలో ఉన్నారు.
మాజీ కాంగ్రెస్ మహిళ బయోలాజికల్ కుతురు సిమోన్ డాస్ శాంటోస్ రోడ్రిగ్స్‌కు కూడా ఆదివారం 31 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, నలుగురు దత్తత తీసుకున్న పిల్లలు, మనవరాలు నిర్దోషులుగా విడుదలయ్యారు. గన్‌మ్యాన్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాస్ శాంటోస్...బయోలాజికల్ కుమారులలో ఒకరికి, అలాగే ఆయుధాన్ని కొనుగోలు చేసిన మరొక కుటుంబ సభ్యునికి ఒక సంవత్సరం క్రితం శిక్ష విధించబడింది.
