వాళ్లకి నిండా పదిహేను సంవత్సరాలు కూడా లేవు. కనీసం ప్రేమకు అర్థం కూడా తెలీదు. అలాంటి వయసులో వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రస్తుతకాలంలో వస్తున్న సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ ప్రభావం అనుకుందాం. కానీ వారి ప్రేమ ఎక్కడిదాకా వెళ్లింది తెలుసా..? బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే బాలుడి వయసు 10ఏళ్లు కాగా.. బాలిక వయసు 13 కావడం గమనార్హం. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రష్యాకి చెందిన ఓ 13ఏళ్ల బాలిక.. పదేళ్ల పిల్లాడి కారణంగా గర్భం దాల్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో... ఆ ఇద్దరినీ రష్యాలోని ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో వాళ్లిద్దరూ చెప్పిన సమాధానాలు విని... అందరూ నోరెళ్లపెట్టారు.

వీళ్లిద్దరూ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తొలిసారి ఎదురుపడ్డారట. తొలి చూపులోనే ఒకరిని మరొకరు ప్రేమించుకున్నారట. ఆ ప్రేమను రెండు రోజుల్లోనే డేటింగ్ దాకా తీసుకుపోయారు. తర్వాత వారిద్దరూ శారీరకంగా కూడా కలిసారట. దీంతో తాను గర్భం దాల్చానని ఆ బాలిక చెప్పడం విశేషం.

Also Read ఈతరం ఇల్లాలు... భర్తను మరో మహిళకు అమ్మేసి ఆ డబ్బుతో....

కాగా.. అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. గర్భానికి వేరెవరో కారణమైతే.. తమ కొడుకును ఇరికించేందుకు ఆ అమ్మాయి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే ఆ అమ్మాయి గర్భానికి కారణం తానే అని 10 ఏళ్ల ఆ అబ్బాయి వాదించాడు. ఆమెకు వేరెవరితోనూ పరిచయం లేదంటూ.. ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చాడు.

 ఇదిలా ఉంటే.. ఆ బాలుడ్ని పరీక్షించిన వైద్యులు మాత్రం.. అతనికి ఇంకా పునరుత్పాదక సామర్థ్యం రాలేదని తేల్చేయడం గమనార్హం.  దీంతో నిజంగా ఆ బాలిక గర్భానికి కారణం ఎవరా అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ మొత్తం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.