పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తూంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన పేలుడులో కనీసం 20 మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం. 

పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తూంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన పేలుడులో కనీసం 20 మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దున ఉన్న వాయువ్య బాజూర్ జిల్లాలో ఓ ముస్లిం రాజకీయ నేత ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్, పోలీస్ బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలకు ప్రారంభించారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం.