Asianet News TeluguAsianet News Telugu

బెడ్రూమ్ మధ్యలో షవర్... అమ్మకానికి వింత ఇల్లు..!

ఓ మహిళ కూడా అలాంటి ఇంటి కోసమే వెతకడం మొదలుపెట్టింది. అలా వెతికే కమ్రంలో ఆమెకు ఓ వింత ఇల్లు కనిపించింది. దీంతో... ఆ   ఇంటి వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.
 

Bizarre house in UK with a shower in the middle of a bedroom goes on sale for Rs 1.6 crore
Author
First Published Nov 18, 2022, 9:45 AM IST


సొంతిల్లు చాలా మంది కళ. కొందరు తమ సొంత ఇంటిని దగ్గరుండి తమకు నచ్చినట్లు నిర్మించుకుంటారు. మరి కొందరు.. కొనుక్కోవాలని చూస్తారు. ఇల్లు కొనుక్కోవడం అంటే అంత సింపుల్ విషయం కాదు. ఇల్లు ఒక్కటి నచ్చితే సరిపోదు. ఆ ఇల్లు ప్రాంతం కూడా నచ్చాలి. దగ్గర్లో అన్ని సదుపాయాలు కూడా ఉండేలా చూసుకుంటాం. ఓ మహిళ కూడా అలాంటి ఇంటి కోసమే వెతకడం మొదలుపెట్టింది. అలా వెతికే కమ్రంలో ఆమెకు ఓ వింత ఇల్లు కనిపించింది. దీంతో... ఆ   ఇంటి వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లోని మూడు పడక గదుల ఇల్లు అమ్మకానికి పెట్టారు. దీనిని ఓ మహిళ ఆన్ లైన్ లో చూసింది. అది మూడు బెడ్రూమ్ ల ఇల్లు. చాలా విశాలంగా ఉంది. చూడగానే ఎవరికైనా నచ్చుతుంది. ఈ ఇంటి ధర భారత కరెన్సీలో రూ.1.6కోట్లుగా అమ్మకానికి పెట్టారు. అయితే... ఈ ఇంటి బెడ్రూమ్ మాత్రం కాస్త వింతగా ఉండటం విశేషం. బెడ్రూమ్ మధ్యలో షవర్ ఏర్పాటు చేయడం విశేషం. ఆ షవర్ కూడా పూర్తిగా గ్లాస్ డోర్ కావడం గమనార్హం.

ఇలా బెడ్రూమ్ మధ్యలో షవర్ ఏర్పాటు చేయడం.... చాలా  వింతగా కనిపిస్తోంది. అయితే... దానికి కూడా కారణం ఉంది. ఇంట్లో ఎక్కువ మంది  ఉన్నప్పుడు... స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉండకూడదని... ఇలా బెడ్రూమ్ మధ్యలో కూడా షవర్ ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  రొమాంటిక్ గా ఉండాలని అలా ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios