ఐదేళ్ల బాలుడి కౌగిలింత ఖరీదు రూ.90 లక్షలు

Bill Worth 90 Lakhs Slammed On Parents For 5 Year Old Son's Mistake in usa
Highlights

సరదాగా ఆడుకుంటూ ఓ చిన్నారి చేసిన చిన్న తప్పు తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టించింది. ఐదేళ్ల చిన్నారి తెలియక చేసిన చిన్న పొరపాటు దాదాపు 90 లక్షలు నష్టాన్ని కలిగించింది. ఈ ఘటన అమెరికా లో చోటుచేసుకుంది. 
 

సరదాగా ఆడుకుంటూ ఓ చిన్నారి చేసిన చిన్న తప్పు తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టించింది. ఐదేళ్ల చిన్నారి తెలియక చేసిన చిన్న పొరపాటు దాదాపు 90 లక్షలు నష్టాన్ని కలిగించింది. ఈ ఘటన అమెరికా లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...ఓవర్ ల్యాండ్ పార్క్ లోని టొమాహక్ కమ్యూనిటీ సెంటర్ కి ఓ ఐదేళ్ల బాలుడు తన తల్లితో కలిసి వెళ్లాడు. అక్కడ హాల్ లో ఉన్న విగ్రహంతో సరదాగా ఆడుకుంటున్నాడు. అయితే బాలుడి ఆ విగ్రహాన్ని కౌగింలించుకోవాలనే ప్రయత్నం చేయగా అదికాస్తా కిందపడి పగిలిపోయింది. అయితే బాలుడికి మాత్రం గాయాలేమి కాలేదు. దీన్ని గమనించిన తల్లి సారా కంగారుపడిపోయి పిల్లాడిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. 

అయితే ఈ విగ్రహం పగిలిపోయిన దృశ్యాలు ఆ హాల్ లోని సిసి కెమెరాలో నమోదయ్యాయి. ఈ వీడియోను గమనించిన కమ్యూనిటీ సిబ్బంది దీనికి కారణమైన సారాకు ఆ విగ్రహం ఖరీదును చెల్లించాలని నోటీసులు పంపారు. అందులోని ఆ విగ్రహ ఖరీదును చూసి సారా నోరెళ్లబెట్టింది. ఇంతకూ దాని ఖరీదెంతో తెలుసా అక్షరాల 1,32,000 డాలర్లు. (ఇండియన్ కరెన్సీలో రూ. 90,87,540) 

అయితే ఆమె ఇంత పెద్ద మొత్తం తాను చెల్లించలేనని తల్లి సారా అధికారులకు విన్నవించుకుంది. అయితే తాము ఆ బిల్లును పొరపాటున సారా ఇంటికి పంపించామని, ఆ విగ్రహానికి ఇన్నూరెన్స్ ఉందని కమ్యూనిటీ సెంటర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో సారా ఊపిరి పీల్చుకుంది.

 

 
 

loader