Asianet News TeluguAsianet News Telugu

ప్రేయసి కోసమే... భార్యకు బిల్ గేట్స్ విడాకులు..?

మిలిందా కంటే ముందు బిల్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందట. ఆమె పేరు అన్ విన్‌బ్లాడ్. మిలిందాతో పెళ్లికి ముందు బిల్.. విన్‌బ్లాడ్‌తో డేటింగ్ చేశారట. ఇద్దరూ కలిసి బాగా తిరిగినట్లు సమాచారం

BIll gates had an agreement with wife melinda french to meet EX Girl friend Ann Winblad once a year
Author
Hyderabad, First Published May 5, 2021, 3:23 PM IST

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు , ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్... తన భార్య మిలిందాతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన విడాకుల ప్రకటన అందరినీ విస్మయానికి గురిచేసింది. 27ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి బంధానికి ఇప్పుడు స్వస్తి పలుకుతున్నామని వారు చెప్పిన విషయం అందరూ షాక్ అయ్యారు. అయితే.. ఆయన అలా భార్యకు విడాకులు ఇవ్వడానికి గల కారణం తాజాగా బయటకు వచ్చింది.

మిలిందా కంటే ముందు బిల్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందట. ఆమె పేరు అన్ విన్‌బ్లాడ్. మిలిందాతో పెళ్లికి ముందు బిల్.. విన్‌బ్లాడ్‌తో డేటింగ్ చేశారట. ఇద్దరూ కలిసి బాగా తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో బిల్‌కు మిలిందాతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. దాంతో 1994లో వివాహబంధంతో ఒక్కటైందీ జంట. 


ఆ సమయంలో బిల్‌గేట్స్ మిలిందాతో ఓ విచిత్రమైన ఒప్పందం చేసుకున్నారట. ఏడాదికి ఒకసారి తన మాజీ ప్రేయసి విన్‌బ్లాడ్‌ను కలిసే అవకాశం ఇవ్వాలనేది ఆ అగ్రీమెంట్. 1997 వరకు కూడా ఈ ఒప్పందం కొనసాగినట్లు ప్రముఖ అమెరికన్ జర్నలిస్ట్ వాల్టర్ ఐజాక్సన్ తెలిపారు. ప్రతియేటా నార్త్ కరోలినాలోని విన్‌బ్లాడ్‌‌కు చెందిన బీచ్ కాటేజ్‌లో ఇద్దరూ కలుసుకునేవారట. వారం రోజుల పాటు చాలా సంతోషంగా గడిపేవారట. ఆ సమయంలో బీచ్ వెంబడి ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని తెగ తిరిగేవారని ఐజాక్సన్ చెప్పారు. 

అయితే, 1997 తర్వాత నుంచి బిల్, మిలిందాల ఈ ఒప్పందం కొనసాగిందా? లేదా? అనేది తెలియదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు మిలిందాను పెళ్లాడే విషయమై బిల్ తన ప్రేయసి విన్‌బ్లాడ్ అభిప్రాయం కూడా తీసుకున్నారట. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుందని ఆమె చెప్పడంతోనే మిలిందాను బిల్ పెళ్లాడినట్టు సమాచారం. ఇప్పుడు ఆ ప్రేయసి కోసమే మిలిందాకి విడాకులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే.. నిజంగా ప్రయేసి కోసమే మిలిందాతో విడాకులు తీసుకుంటున్నారో లేదో క్లారిటీ మాత్రం లేదు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios