Asianet News TeluguAsianet News Telugu

రీ కౌంటింగ్ కోసం పట్టు.. ట్రంప్ కి కోర్టు షాక్..!

పోలింగ్‌లో అక్రమాలంటూ చేసిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని జడ్జి మాథ్యూ బ్రాన్‌ పేర్కొన్నారు.

Biden to announce first Cabinet picks on Tuesday as Trump legal efforts stall
Author
hyderabad, First Published Nov 23, 2020, 10:47 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘోర ఓటమిని చవి చూశారు. అయితే.. ఆ ఓటమిని డోనాల్డ్ ట్రంప్  అంగీకరించలేదు. ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ కి మరోసారి కోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలిచిన పెన్సిల్వేనియాలో పోలింగ్‌లో అక్రమాలు జరిగాయనీ, రీకౌంటింగ్‌ చేపట్టా లంటూ ట్రంప్‌ బృందం వేసిన పిటిషన్లను పెన్సిల్వేనియా మిడిల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు కొట్టేసింది. పోలింగ్‌లో అక్రమాలంటూ చేసిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని జడ్జి మాథ్యూ బ్రాన్‌ పేర్కొన్నారు.


దాదాపు 70 లక్షల ఓట్లను చెల్లనివంటూ ప్రకటించాలని కోరడం తగదంటూ పిటిషన్‌ను తోసి పుచ్చారు. ఈ పరిణామంపై అధ్యక్షుడు ట్రంప్‌ అటార్నీ రూడీ గిలియానీ స్పందిం చారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టుకు త్వరగా వెళ్లేందుకు పెన్సిల్వేనియా కోర్టు తీర్పు దోహదపడుతుందన్నారు. ఆధారాలను పరిశీ లించకుండానే, ఒబామా హయాంలో నియమించిన ఈ జడ్జి పిటిషన్‌ను కొట్టేశారని ఆరోపించారు. ఈ తీర్పుపై త్వరలోనే థర్డ్‌ సర్క్యూట్‌ కోర్టుకు వెళతామన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios