Asianet News TeluguAsianet News Telugu

బ్రెజిల్‌‌కు కొవాగ్జిన్: ఒక్క పైసా అందలేదు.. డోసులు స‌ర‌ఫ‌రా చేయ‌లేదు, భార‌త్ బ‌యోటెక్ ప్రకటన

బ్రెజిల్‌లో కోవాగ్జిన్ స్కామ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావడంతో అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు పెద్ద ఎ్తతున రోడ్ల మీదకు వస్తున్నారు. అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో తక్షణం రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. అధిక ధ‌ర‌కు కోవాగ్జిన్ కొనుగోలు చేసిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌తో ఆ దేశాధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో చిక్కుల్లో ప‌డ్డారు.

Bharat Biotech denies allegations of irregularities says no advance payment received from Brazil ksp
Author
Brazil, First Published Jun 30, 2021, 4:02 PM IST

బ్రెజిల్‌లో కోవాగ్జిన్ స్కామ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావడంతో అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు పెద్ద ఎ్తతున రోడ్ల మీదకు వస్తున్నారు. అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో తక్షణం రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. అధిక ధ‌ర‌కు కోవాగ్జిన్ కొనుగోలు చేసిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌తో ఆ దేశాధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో చిక్కుల్లో ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో భార‌త్ బ‌యోటెక్ కీలక ప్ర‌క‌ట‌న చేసింది. బ్రెజిల్ నుంచి కోవాగ్జిన్ టీకాల కోసం ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోలేద‌ని, ఆ దేశానికి కోవిడ్ టీకాల‌ను కూడా స‌ర‌ఫ‌రా చేయ‌లేద‌ని భార‌త్ బ‌యోటెక్ స్పష్టంట చేసింది.

బ్రెజిల్‌తో కోవాగ్జిన్ ప్రొక్యూర్మెంట్‌లో జ‌రిగిన ఒప్పందాన్ని భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఈ సందర్భంగా వివ‌రించింది. 8 నెల‌ల పాటు సాగిన ఒప్పంద ప్ర‌క్రియ విధానంలో అన్ని ష‌ర‌తుల‌ను పాటించిన‌ట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 29వ తేదీ వ‌ర‌కు కూడా త‌మ‌కు ఎటువంటి పేమెంట్ అంద‌లేద‌ని భార‌త్ బ‌యోటెక్ పేర్కొంది. విదేశాలకు కోవాగ్జిన్ స‌ర‌ఫ‌రా విష‌యంలో దాని ధ‌ర‌ను డోసుకు 15 నుంచి 20 డాల‌ర్లుగా నిర్ణయించినట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. ఈ క్రమంలోనే బ్రెజిల్‌కు కూడా డోసును 15 డాల‌ర్ల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు భార‌త్ బ‌యోటెక్ తెలిపింది.

Also Read:బ్రెజిల్ రాజకీయాల్లో ‘‘కొవాగ్జిన్’’ కుంపట్లు.. అధ్యక్షుడు బొల్సోనారో కుర్చీకి ఎసరు

కోవాగ్జిన్ టీకాల‌ను కొనుగోలు చేసేందుకు ఫిబ్ర‌వ‌రిలో బ్రెజిల్ ఆరోగ్య‌శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దేశంలో కోవాగ్జిన్ టీకాల‌ను ప్రెసికా మెడికోమెంట‌స్ ఫార్మ‌సీ సంస్థ స‌ర‌ఫ‌రా చేయ‌నుంది. దీనిలో భాగంగా తొలుత రెండు కోట్ల కోవాగ్జిన్ డోసుల‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క డోసు టీకా కూడా బ్రెజిల్‌కు చేర‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదేశ పార్ల‌మెంట‌రీ క‌మిటీ చేప‌ట్టిన ద‌ర్యాప్తులో ఆరోగ్య‌శాఖ తీరును త‌ప్పుప‌ట్టారు. దీంతో కోవాగ్జిన్ కోసం భార‌త్ బ‌యోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రెసికా సంస్థ డీల్‌ను ర‌ద్దు చేయాల‌ని పార్ల‌మెంట‌రీ క‌మిటీ భావిస్తోంది. 

కోవాగ్జిన్‌కు చెందిన టీకా ప‌రీక్ష‌లు పూర్తి కాక‌ముందే, అధిక ధ‌ర‌ల‌కు ఆ టీకా కోసం ఒప్పందం కుదిరిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆ డీల్‌ను ర‌ద్దు చేయాల‌ని పార్ల‌మెంట‌రీ క‌మిటీ నిర్ణ‌యించింది. అయితే కోవాగ్జిన్ కుంభకోణంలో త‌న‌కు ఎలాంటి ప్రమేయం లేద‌ని బొల్స‌ోనారో చెప్పారు. కాగా, దేశంలో కోవిడ్‌ను నియంత్రించ‌డంలో బొల్స‌నారో విఫ‌ల‌మైన‌ట్లు ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌క్కువ ధ‌ర‌కే కోవిడ్ టీకాలు ల‌భిస్తుంటే.. కోవాగ్జిన్ ఒక డోసు టీకాకు 15 డాల‌ర్లు ఎందుకు చెల్లిస్తున్నార‌ని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మేధావులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios