భారతదేశంలో మైనారిటీల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా ఒబామా వ్యాఖ్యలపై అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్ మాజీ కమిషనర్ జానీ మూర్ స్పందించారు. 

భారతదేశంలో మైనారిటీల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా ఒబామా వ్యాఖ్యలపై అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్ మాజీ కమిషనర్ జానీ మూర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు (బరాక్ ఒబామా) భారతదేశాన్ని విమర్శించడం కంటే భారతదేశాన్ని పొగడడానికే ఎక్కువ శక్తిని వెచ్చించాలని తాను భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. మానవ చరిత్రలో భారతదేశం అత్యంత వైవిధ్యభరితమైన దేశమని కొనియాడారు. 

అమెరికా ఎలాగైతే పరిపూర్ణ దేశం కాదో.. భారతదేశం కూడా ఒక పరిపూర్ణ దేశం కాదని అన్నారు. అయితే భారతదేశానికి ఆ దేశంలోని వైవిధ్యమే బలమని పేర్కొన్నారు. అయితే ఆ విమర్శలో కూడా మాజీ అధ్యక్షుడు ఒబామా భారత ప్రధాని మోదీని అభినందించకుండా ఉండలేకపోయారని అన్నారు. ఆయనతో కొంత సమయం గడిపినందుకు తాను ఖచ్చితంగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. 

ఇక, ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌లో ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ.. తాను మోదీతో మాట్లాడితే భారత్‌లో మైనారిటీల హక్కుల గురించి ప్రస్తావిస్తానని చెప్పారు. భారతదేశంలోని మైనారిటీల హక్కులను పరిరక్షించకపోతే.. ఏదో ఒక సమయంలో దేశంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు. 

Scroll to load tweet…


ఇదిలా ఉంటే, ఒబామా వ్యాఖ్యలపై భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒబామా హయాంలో ఆరు ముస్లింలు మెజారిటీగా ఉన్న దేశాలపై యూఎస్ బాంబులతో విరుచుకుపడలేదా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారని.. అందులో ఆరు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. 

ఇక, ప్రధానమంత్రి మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా.. తమ ప్రభుత్వం 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' సూత్రంపై ఎలా పనిచేస్తుందనేది, ఏ వర్గం పట్ల ఎలాంటి వివక్ష చూపదని విలేకరుల సమావేశంలో అన్నారు.