Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బ్రేకింగ్.. ఒబామా, బిల్ గేట్స్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్

వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ సపోర్ట్ టీమ్ హ్యాకింగ్‌కు గురైన ప్రముఖుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ఖాతాల నుంచి వేరొకరు ట్వీట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. అప్పటికే చేసిన ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.

Barack Obama, Joe Biden, Elon Musk, Apple, and others hacked in unprecedented Twitter attack
Author
Hyderabad, First Published Jul 16, 2020, 9:27 AM IST

వాళ్లంతా సామాన్యులు కాదు... సెలబ్రెటీలు.. అందులోనూ అంతర్జాతీయ ప్రముఖులు. వాళ్ల ట్విట్టర్లు ఒక్కసారిగా హ్యాకింగ్ కి గురయ్యాయి. వారిలో..  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా,  అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియన్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. 

వీరి అధికారిక ఖాతాలను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. వారికి సంబంధం లేకుండా  ట్వీట్లు చేశారు. వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ సపోర్ట్ టీమ్ హ్యాకింగ్‌కు గురైన ప్రముఖుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ఖాతాల నుంచి వేరొకరు ట్వీట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. అప్పటికే చేసిన ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.

 

అంతేకాదు ఉబెర్, యాపిల్ కార్పొరేట్ ఖాతాలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. ప్రముఖ క్రిప్టో ట్విటర్ ఖాతాలు కామెరాన్, టైలర్ వింక్లివోస్, జెమిని క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజ్, కాయిన్ ఎంబేస్ యాప్‌లు సైతం హ్యాకర్ల బారినపడ్డాయి. కాగా.. ఇలా ప్రముఖలందరి ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కి గురవ్వడం ఇదే తొలిసారి. ఈ న్యూస్ అందరినీ షాకింగ్ కి గురిచేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios