ఓ వ్యక్తి న్యూయార్క్ లో అత్యంత అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అది కూడా న్యూయార్క్ వీధిలో బ్రాడ్ వేని మూసివేసి మరీ... వారు భారాత్ నిర్వహించడం గమనార్హం
భారతీయ వివాహాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వందల, వేల సంఖ్యలో అతిథులు, మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలో ఎంత హంగూ, ఆర్భాటాల మధ్య పెళ్లి చేసుకునేవారు చాలా మందే ఉన్నారు. ఎవరి స్థోమతను బట్టి వారు చేసుకుంటూ ఉంటారు. కాగా... విదేశాల్లో ఉన్న భారతీయులకు అదిసాధ్యం కాదు.. ఇక్కడకు వచ్చి చేసుకోవాలి లేదంటే... అక్కడే సింపుల్ గా చేసుకోవాలి. కానీ... ఓ వ్యక్తి న్యూయార్క్ లో అత్యంత అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అది కూడా న్యూయార్క్ వీధిలో బ్రాడ్ వేని మూసివేసి మరీ... వారు భారాత్ నిర్వహించడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యుఎస్ కాంగ్రెస్ మాజీ అభ్యర్థి సూరజ్ పటేల్ న్యూయార్క్‌లో తన సోదరుడి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఇందులో 'బారత్' సంప్రదాయ దుస్తులలో బాలీవుడ్ పాటలకు సంబరాలు చేసుకుంటూ, డ్యాన్స్ లు చేయడం గమనార్హం. "మా తమ్ముడి పెళ్లి కోసం మేము బ్రాడ్‌వేని మూసివేసాము!" అంటూ అతను ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
తన సోదరుడి పెళ్లి కోసం.. తన కుటుంబం మొత్తం న్యూ యార్క్ నగరానికి రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించందని.. తాము న్యూ యార్క్ వీధుల్లో బారత్ నిర్వహించామంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చాడు.
వీడియోలో... అనేక మంది పురుషులు గులాబీ రంగు తలపాగాలు ధరించి, సాంప్రదాయ దుస్తులలో మహిళలు నృత్యం చేస్తూ, పాటలను ఆస్వాదిస్తూ కనిపించారు. బాలీవుడ్ సాంగ్స్ కి వారు డ్యాన్స్ లు చేస్తుండటం గమనార్హం.
పటేల్ సెప్టెంబరు 25న వీడియోను పంచుకున్నారు. అప్పటి నుండి ఇది 827,000 కంటే ఎక్కువ వ్యూస్... 19,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. కాగా.. ఈ వీడియోకి పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తుండటం గమనార్హం. మీకు అసలు బ్రాడ్ వే మూసివేయడానికి అనుమతి ఎవరు ఇచ్చారని.. దాని వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.
