Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. కరోనా వేళ మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి

మన దేశంలో అన్ని ప్రార్ధనా మందిరాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 3.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా వాటికీ మాత్రం అనుమతివ్వలేదు. అయితే మత సంస్థల ఒత్తిడి కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Bangladesh lifts curbs on mosque prayers as lockdown eases
Author
Hyderabad, First Published May 9, 2020, 2:44 PM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దాదాపు 30లక్షలకు పైగా ఈ వైరస్ సోకింది. అయితే.. దీనిని అరికట్టేందుకు పలు దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ లాక్ డౌన్ ని కొనసాగిస్తూనే ఉన్నారు.

మన దేశంలో అన్ని ప్రార్ధనా మందిరాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 3.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా వాటికీ మాత్రం అనుమతివ్వలేదు. అయితే మత సంస్థల ఒత్తిడి కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎట్టకేలకు ముస్లింలు మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ.. అన్ని మసీదుల్లోనూ హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచాలని.. ఎవరి మ్యాట్ వారే తెచ్చుకోవాలని సూచించింది. 

అయితే మసీదు పరిసరాల్లో మాత్రం ఇఫ్తార్ విందులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కాగా, బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 13,134 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా కారణంగా 206 మంది ప్రాణాలు విడిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios