భారతదేశంలో తీవ్ర సంచనం సృష్టించిన జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌పై న్యాయపరమైన వేధింపులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భారత్‌ను ప్రశ్నించింది. అయితే చట్టానికి ఎవరూ అతీతులు కాదని .. ఇండియా ఐరాసకు క్లియర్‌గా తేల్చిచెప్పింది
భారతదేశంలో తీవ్ర సంచనం సృష్టించిన జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌పై న్యాయపరమైన వేధింపులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భారత్‌ను ప్రశ్నించింది. అయితే చట్టానికి ఎవరూ అతీతులు కాదని .. ఇండియా ఐరాసకు క్లియర్‌గా తేల్చిచెప్పింది. తప్పుదోవ పట్టించే కథనాన్ని ముందుకు తీసుకెళ్లడం ఐక్యరాజ్యసమితి ప్రతిష్టను దిగజార్చడమేనని భారత్ పేర్కొంది. ఎంప్యానెల్ చేయబడిన మానవ హక్కుల నిపుణులను ఉటంకిస్తూ.. జెనీవాకు చెందిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి.. జర్నలిస్ట్ అయ్యూబ్ రిపోర్టింగ్‌కు సంబంధించి కొన్నేళ్లుగా భారత అధికారుల చేత చట్టపరమైన వేధింపులకు గురవుతోందని పేర్కొంది.
స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఆమె ప్రజల నుంచి స్వీకరించిన నిధులలో అవకతవకలకు పాల్పడినట్లు రాణా ఆయుబ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆమె తీసుకున్న విరాళాలను సరైన ప్రయోజనాల కోసం ఉపయోగించలేదని.. విరాళాలలో కొంత భాగాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకున్నారని ఈడీ ఆరోపించింది.
ఈ మనీ లాండరింగ్ కేసులో రాణా ఆయుబ్‌కు చెందిన రూ.1.77 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అటాచ్ చేసింది. దాతల నిధులను వ్యక్తిగతంగా వినియోగించుకున్నారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద రాణా అయూబ్, ఆమె కుటుంబం పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లను అటాచ్‌మెంట్ చేయడానికి ఈడీ ఫిబ్రవరి 11న తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే భారతదేశంలో కొనసాగుతున్న అంతర్గత దర్యాప్తులో ఐక్యరాజ్యసమితి 'జోక్యం' ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఆమోదించాల్సిన అవసరంపై గ్లోబల్ బాడీని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
జెనీవాలోని ఇండియన్ మిషన్ ట్విటర్‌లో స్పందిస్తూ, "న్యాయపరమైన వేధింపులు అని పిలవబడే ఆరోపణలు నిరాధారమైనవని, అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది. భారతదేశం చట్టబద్ధమైన పాలనను సమర్థిస్తుందని.. ఇదే సమయంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదు" అని పేర్కొంది. ప్రత్యేక విధానాల (నిపుణులు) లక్ష్యం ఖచ్చితంగా తెలియజేయాలని తాము ఆశిస్తున్నామని .. తప్పుదారి పట్టించే కథనాన్ని ముందుకు తీసుకెళ్లడం వెళ్ల ఐక్యరాజ్యసమితి ఖ్యాతి మసకబారుతోందని జెనీవాలోని భారత మిషన్ పేర్కొంది.
మరోవైపు.. సోషల్ మీడియా స్పందనలతో హోరెత్తింది. ‘‘రాణా తన అక్రమాస్తుల కోసం డబ్లూఏపీవో వేదికగా ఎండార్స్‌మెంట్‌ను నిర్వహించిందంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఐక్యరాజ్యసమితి తన అధికార పరిధిని మించిపోయిందని, భారతదేశ న్యాయవ్యవస్థను బలహీనపరిచిందని మరికొందరు నిందించారు.
