భారత సంతతి చెఫ్ రిషి రూప్ సింగ్ ను వివాహమాడిన ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ ఉరఫ్ మరియా సింగ్ హార్ట్ ఎటాక్ తో మరణించింది. ఆమె వయసు 31 సంవత్సరాలు మాత్రమే. ఆమె అమెరికాలో ఇంటీరియర్ డిజైనర్ గా తన సొంత కంపెనీని నడుపుతున్నారు. 

ఏప్రిల్ 2017లో హ్యూస్టన్ నగరంలో మరియా చెఫ్ రిషి రూప్ సింగ్ ను పెళ్లాడింది. అతను అదే నగరంలో ఒక పేరుమోసిన చెఫ్. వీరిరువురిదీ ప్రేమ వివాహం. వారి ప్రేమకు గుర్తుగా వారికి రెండు సంవత్సరాల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. 

1988లో లగ్జంబర్గ్ లో పుట్టిన మరియా 5 సంవతసరాల్ వయసులోనే కుటుంబంతో సహా రష్యా కి మకాం మార్చారు. ఆ తరువాత ఆ తరువాత బెల్జియం లో చదువు పూర్తిచేసుకొని, అక్కడి నుండి చికాగో, ఇలినోయిస్ సహా అనేక నగరాల్లో నివసించింది. 

ఆ తరువాత హ్యూస్టన్ లో రిషిని పెళ్లాడిన తరువాత అక్కడే వారు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువరాణి మరణ వార్త తెలిసి, రాజకుటుంబీకులంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పేపర్లో వచ్చిన సంతాప వార్తను ద్వారా ఈ విషయం మీడియా కంట్లో పడింది!

ఇకపోతే.... అమెరికాలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపు 40శాతం అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే అమెరికాలో 14లక్షల కేసులు నమోదు కాగా.. 80వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

కాగా.. అమెరికాకి ఈ కరోనా వైరస్ కారణంగా భవిష్యత్తులో అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కోవిడ్‌-19 క‌ట్ట‌డికి ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న ఫ‌లితం లేకుండా పోతోంది. 

రోజురోజుకి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల యూఎస్‌లో ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. 

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల్ కావ‌డంతో నిరుద్యోగిత కూడా పెరిగిపోతోంది. ఇదిలాఉంటే... వ‌చ్చే శీతాకాలం ముందే ఈ వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ప్ర‌త్యేక‌ ప్ర‌తినిధి రిక్ బ్రైట్ అన్నారు. క‌రోనా క‌ట్ట‌డి విష‌య‌మై సంసిద్ధత గురించి ఆందోళన వ్యక్తం చేసినందుకు బయోమెడికల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా తనను తొలగించినట్లు బ్రైట్ పేర్కొన్నాడు.