ఆస్ట్రేలియాలో ఓ పెళ్లి బస్సు ప్రమాదానికి లోనైంది. ప్రాథమిక అంచనా ప్రకారం 10 మంది మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. ఈ సంఖ్య మారొచ్చని పోలీసులు తెలిపారు.
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీకి ఉత్తరాన ఉన్న హంటర్ వైన్ ప్రాంతంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది మరణించగా, మరో 11 మంది గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు.
చిన్న పట్టణం గ్రెటా సమీపంలోని ఒక జంక్షన్ వద్ద "కోచ్ బోల్తా పడింది" అని పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అర్ధరాత్రి అందిందని.. అంతకు కొద్దిసేపటి ముందు ఆదివారం ఆలస్యంగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
"ప్రాథమిక విచారణలో ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు తెలిపారు. గాయపడిన 11 మందిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో బస్సులో మరో 18 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారు గాయపడలేదు" అని పోలీసులు తెలిపారు. వివరాలు పూర్తిగా తేలేలోపు ఈ గణాంకాల్లో మార్పు రావచ్చని పోలీసులు తెలిపారు.
తూగో జిల్లాలో లారీని ఢీ కొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి..
ఘటనకు సంబంధించి పూర్తి అంచనా కోసం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. 58 ఏళ్ల బస్సు డ్రైవర్ తప్పనిసరి పరీక్ష కోసం పోలీసు గార్డులో ఆసుపత్రికి తీసుకెళ్లారు" అని వారు చెప్పారు. ఈ ప్రాంతాన్ని స్పెషలిస్ట్ ఫోరెన్సిక్ పోలీసులు, క్రాష్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పరిశీలిస్తోంది.
ప్రమాదం జరిగిన హంటర్ ప్రాంతం ద్రాక్షతోటలు, కంగారూలు,స్థానిక బుష్‌ల్యాండ్ లతో ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. విహారయాత్రలకు ప్రసిద్ధ ప్రదేశం.
స్థానిక మేయర్ మాట్లాడుతూ బస్సు సమీపంలోని వైన్ ఎస్టేట్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ నుండి వచ్చినట్లు భావిస్తున్నారు. "దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇది వెడ్డింగ్ చార్టర్డ్ బస్సు అని తెలుస్తోంది."అని సమీపంలోని సెస్నాక్ మేయర్ జే సువాల్ చెప్పారు.
