మెడలో కొండ చిలువ పెట్టుకొని యువకుడి సర్ఫింగ్.. రిజల్ట్ ఇదే..!

ఓ వ్యక్తి తాజాగా తన మెడలో కొండ చిలువను వేసుకొని పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చేశాడు ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా, ఈ ఘటనపై అధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. 

Australian man fined Rs 13,000 for surfing with pet python around his neck ram


కొండ చిలువ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు.  దానిని ఊహించుకోవడానికే భయపడుతుంటే, రియల్ గా ఓ వ్యక్తి దానిని పబ్లిక్ లోకి తీసుకువస్తే, జనాలు ఎంత భయపడిపోతారో స్పెషల్ గా  చెప్పక్కర్లేదు. ఓ వ్యక్తి తాజాగా తన మెడలో కొండ చిలువను వేసుకొని పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చేశాడు ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా, ఈ ఘటనపై అధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే,  ఒక ఆస్ట్రేలియన్ సర్ఫర్ తన మెడ చుట్టూ కొండచిలువను చుట్టుకొని బయటకు వచ్చాడు.  నిర్భయమైన సర్ఫర్ ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో తన పెంపుడు కొండచిలువను తీసుకొని వెళ్లాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సరీసృపాన్ని బహిరంగంగా ఉంచడానికి అతని వద్ద అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి 2,322 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 12,495) జరిమానా విధించారు.

"ఒక జంతువును బహిరంగంగా తీసుకెళ్లడానికి లేదా ప్రదర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం" అని క్వీన్స్‌లాండ్ పర్యావరణ, విజ్ఞాన విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పాములకు ఈత ఈదడం సులభం కాబట్టి, అవి సులభంగా నీటిలో తప్పించుకోగలవని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే షార్క్ లతో ఇబ్బంది పడుతుతంటే, మళ్లీ ఈ పాములను తీసుకువస్తారా అని  అధికారులు సీరియస్ అయ్యారు.

కార్పెట్ కొండచిలువలు విషం లేని పాములు, ఇవి మూడు మీటర్ల (సుమారు 10 అడుగులు) పొడవు వరకు పెరుగుతాయి. అయితే, ఇవి మనిషిని బిగించి, ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios