రూ.10 కోట్లు గెలుచుకొన్న లాటరీ టిక్కెట్టు, 38 రోజులు ప్రిజ్‌పై ఇలా....

Australian Lottery Winner had $1.5 Million Ticket on Fridge for 38 Days
Highlights

6 వారాల వరకు ఆ విషయమే తెలియదు


కాన్‌బెర్రా:  తాను కొన్ని లాటరీకి బంపర్ ప్రైజ్ వచ్చిన విషయం తెలియకుండా ఆ లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేసిన వ్యక్తి  38 రోజుల పాటు ఆ టిక్కెట్టును తమ ఇంట్లోని ఫ్రిజ్‌పై ఉంచాడు. అయితే లాటరీ నిర్వాహకులే అతడిని వెతికి పట్టుకొనే ప్రయత్నం చేశారు.  చివరకు ఆ వ్యక్తి సమాచారం తెలిసి సంతోషపడ్డారు. రూ.10 కోట్లు లాటరీలో డబ్బులను గెలుచుకొన్నాడు.

 అస్ట్రేలియాలోని కాథెరైన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి టాట్స్‌లొట్టో 3839 అనే నెంబర్ లాటరీని కొనుగోలు చేశారు. అయితే ఈ  నెంబర్ లాటరీకి సుమారు రూ. 10 కోట్ల లాటరీ తగిలింది. ఈ లాటరీ తగిలింది ఇద్దరికి మాత్రమే. అయితే ఈ డబ్బులను  ఒక్క వ్యక్తి లాటరీ నిర్వాహకుల నుండి తీసుకొన్నాడు. మరో వ్యక్తి మాత్రం లాటరీ డబ్బులను మాత్రం తీసుకోలేదు. 

లాటరీని గెలుచుకొన్న విషయాన్ని ప్రకటించిన ఆరు వారాలు దాటినా కూడ ఆ వ్యక్తి మాత్రం లాటరీలో గెలుచుకొన్న ప్రైజ్ మనీని తీసుకోలేదు. అయితే  ఈ లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేసిన వ్యక్తి కోసం లాటరీ నిర్వాహకులు కూడ  వెతకడం ప్రారంభించారు. 

లాటరీ విజేత కాథెరైన్ ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు.  ఈ విషయాన్ని మీడియాలో ప్రకటించారు. అయితే  మీడియాలో ఈ విషయాన్ని చూసిన ఆ వ్యక్తి  తాను కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టు నెంబర్ కోసం ప్రిజ్ పై ఉంచిన టిక్కెట్టును చూశాడు. తనకే ఆ ఫ్రైజ్ మనీ దక్కిందని ఆయన గుర్తించాడు. వెంటనే లాటరీ నిర్వాహకుల వద్దకు వెళ్ళి తాను కొనుగోలు చేసిన టిక్కెట్టుకే డబ్బులు వచ్చాయని ఆయన చెప్పాడు. అంతేకాదు తన వద్ద ఉన్న లాటరీ టిక్కెట్టును కూడ చూపించాడు.

తాను కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టుకే ప్రైజ్ మనీ రావడం తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. తనకు లాటరీ వచ్చిన విషయం 38 రోజుల వరకు కూడ తెలియదన్నారు. 38  రోజుల పాటు లాటరీ టిక్కెట్టు ప్రిజ్ పైనే ఉంచినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. 
 

loader