భవనంపై నక్కి.. ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతనే...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో కాల్పులు జరిపిన నిందితుడిని ఎఫ్‌బీఐ గుర్తించింది. నిందితుడు 20 ఏళ్ల క్రూక్స్‌.. రిపబ్లికన్‌గా నమోదు చేసుకున్నట్లు గుర్తించారు. 

Attempted Assassination on Donald Trump at Pennsylvania Rally: Suspect Identified as Thomas Mathew Crooks GVR

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గుర్తించింది. నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. క్రూక్స్ వయసు 20 సంవత్సరాలు కాగా.. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ప్రచార ర్యాలీలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. దీంతో భద్రతా అధికారులు ఎదురు కాల్పులు జరపగా అతను మరణించాడు. అమెరికా ఓటర్ల రికార్డుల ప్రకారం థామస్ మాథ్యూ క్రూక్స్‌ రిపబ్లికన్‌గా నమోదయ్యాడు. క్రూక్స్‌ పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తిగా FBI గుర్తించింది. అయితే, ట్రంప్‌ కాల్పులను హత్యాయత్నంగా పరిగణించిన FBI.. దుండగుడు కాల్పులు జరపడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలియలేదని తెలిపింది. 

జులై 15 నుంచి రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌ జరగనుండగా... చివరి ర్యాలీని ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రసంగిస్తుండగానే క్రూక్స్‌ కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్‌ ట్రంప్‌ చెవికి తగలడంతో వెంటనే కుప్పకూలాడు. ఈ కాల్పుల్లో ట్రంప్‌ పక్కనే ఒకరు చనిపోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించి ఎదురుకాల్పులు జరపడంతో అతను హతమయ్యాడు. కాగా ఘటనా స్థలంలో ఏఆర్-15 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

కుడి చెవిని చీల్చిన బుల్లెట్‌... 

ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన కాల్పుల్లో తన కుడి చెవికి గాయమైనట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ‘‘విజ్లింగ్‌ సైండ్‌, షాట్‌లు వినగానే ఏదో తప్పు జరిగిందని తెలిసింది.. అంతలోనే బుల్లెట్ నా చర్మాన్ని చీల్చినట్లు అనిపించింది’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ సైట్‌లో పేర్కొన్నారు. చాలా రక్తస్రావం కావడంతో ఏం జరుగుతుందో తాను గ్రహించానని తెలిపారు. వేగంగా స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యం కాని విషయమన్నారు.

Attempted Assassination on Donald Trump at Pennsylvania Rally: Suspect Identified as Thomas Mathew Crooks GVR

ట్రంప్‌పై కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్స్ భద్రత బలగాలు చేతిలో హతమవగా.. అతను సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. ‘ఐ హేట్ రిపబ్లికన్స్, ఐ హేట్ ట్రంప్’ క్రూక్స్ చెబుతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. 

  

హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత ట్రంప్ ఫోర్స్ వన్ విమానంలో నుంచి మెట్లు దిగి సాధారణంగా నడిచి వెళ్తూ కనిపించారు. చెవికి గాయమైనప్పటికీ ట్రంప్ ప్రాణానికి ఎలాంటి హాని లేదని తెలుస్తోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios