Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ లో కాళీ మాత ఆల‌యంపై దాడి.. విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన దుండ‌గులు

బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఆ దేశంలోని జెనైదా జిల్లా దౌతియాలోని కాళీ మాత ఆలయంపై పలువురు దాడికి పాల్పడ్డారు. విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 

Attack on the temple of Kali Mata in Bangladesh.. Thugs destroyed the idol
Author
First Published Oct 8, 2022, 2:15 PM IST

బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంపై మ‌రోసారి దాడి జ‌రిగింది. ఆ దేశంలోని జెనైదా జిల్లా దౌతియా గ్రామంలోని కాళీ ఆలయంపై దుండ‌గులు శుక్రవారం దాడికి పాల్ప‌డ్డారు. కాళీ మాత విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ విగ్ర‌హం త‌ల ఆల‌య ప్రాంగ‌ణం నుంచి అర కిలోమీటరు దూరంలో ల‌భించింది. పశ్చిమ బెంగాల్ లో హిందువులకు అతిపెద్ద వేడుక అయిన 10 రోజుల దుర్గా పూజ పండుగ ముగిసిన మ‌రుస‌టి రోజే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం విచార‌క‌రం.

ఇస్రో ఖాతాలో మ‌రో విజ‌యం.. చంద్రునిపై సోడియంను కనుగొన్న చంద్రయాన్-2

కాగా.. దాడికి పాల్పడిన వ్యక్తులను ఇంకా గుర్తించలేదు. నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి అధికారులు ద‌ర్యాప్తును ప్రారంభించారు. ప్ర‌స్తుతం దాడికి గురైన ఈ ఆల‌యం బ్రిటీష్ కాలం నుండి ప్రాచూర్యం పొందింది. కాళీ మాత భ‌క్తులు అప్ప‌టి నుంచి త‌ర‌చుగా ఈ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఈ బంగ్లాదేశ్ పశ్చిమ భాగంలో ఉంది.

ఈ ఘ‌ట‌న‌పై బంగ్లాదేశ్ పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చందనాథ్ పొద్దార్ మాట్లాడుతూ.. ఆలయంలో రాత్రి సమయంలో దాడి జరిగిందని, శుక్రవారం ఉదయం అధికారులు పగిలిన విగ్రహాన్ని గుర్తించార‌ని చెప్పారు. ఝెనైదా పోలీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ బర్మన్ మాట్లాడుతూ.. “ ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు అయ్యింది. అనుమానితులను గుర్తిచాం. ఈ ఘటన మినహా ఈ ఏడాది బంగ్లాదేశ్ అంతటా దుర్గాపూజ పండుగను ప్రశాంతంగా జరుపుకున్నారు. ’’ అని ఆయన తెలిపారు.

ఒకే వేదికపై గౌతమ్ అదానీ, అశోక్ గెహ్లాట్.. రాజస్తాన్‌కు పోటెత్తిన పెట్టుబడి.. శత్రువు మిత్రుడయ్యాడా?: బీజేపీ

గతేడాది (2021)లో దుర్గాపూజ వేడుకల్లో ఇస్లామిస్టులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. చాంద్‌పూర్‌లోని హజీగంజ్, ఛటోగ్రామ్‌లోని బన్ష్‌ఖాలీ, చపైనవాబ్‌గంజ్‌లోని షిబ్‌గంజ్, కాక్స్‌బజార్‌లోని పెకువాలోని దేవాలయాలపై హిందూ భక్తులపై వారు దారుణంగా దాడి చేశారు. దేశంలోని హిందువులను ఇస్లామిస్టులు బహిరంగంగా టార్గెట్ చేసుకొని ఈ దాడులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌ల్లో దాదాపు ఆరుగురు మ‌ర‌ణించారు. వందలాది మంది గాయపడ్డారు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడినైతే నా చేతిలోనే రిమోట్ కంట్రోల్ ఉంటుంది - మ‌ల్లికార్జున్ ఖర్గే

ఇటీవలి నెలల్లో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబరులో దుర్గాపూజకు ముందు, బారిసాల్‌లోని మెహెందిగంజ్ ఉప జిల్లాలోని కాశీపూర్ సర్బజనిన్ దుర్గా ఆలయంలో గుర్తుతెలియని దుండ‌గులు విగ్రహాలను  ధ్వంసం చేశారు. అంతకుముందు ఆగస్టులో  బంగ్లాదేశ్‌లోని మోంగ్లా ఉపజిల్లాలోని కైన్‌మారీ ఆలయంలో హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై  ముగ్గురు మదర్సా విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు . ఆలయం పక్కనే ఉన్న మైదానంలో ఫుట్‌బాల్ ఆడటం మానేయాలని మదర్సాకు చెందిన పలువురు ముస్లిం యువకులను ఆలయ నిర్వాహకులు అభ్యర్థించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

అలాగే జూలై 16వ తేదీన నరైల్‌లోని లోహగరాలోని సహపరా ప్రాంతంలో ఒక ముస్లిం గుంపు కేవలం ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా ఒక దేవాలయం, కిరాణా దుకాణం, అనేక హిందూ గృహాలను ధ్వంసం చేసింద‌ని నివేదిక‌లు వెలువ‌డ్డాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios