ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని బీఏపీఎస్ లక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి జరిగింది. ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయాన్ని ధ్వంసం చేసి, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. 

ఖలిస్తాన్ మద్దతుదారులు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని బీఏపీఎస్ లక్ష్మీ నారాయణ ఆలయంపై గురువారం దాడి చేసి ధ్వంసం చేశారు. అంతే కాదు ఆలయ గోడలపై వ్యతిరేక చిత్రాలు, నినాదాలు కూడా రాశారు. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను అమరవీరుడని పేర్కొన్నారు.

మేకప్ ఎంతపని చేసింది... వధువును చూసి కంగుతిన్న వరుడు... పెళ్ళి క్యాన్సిల్

ఆలయ గోడలపై విధ్వంసం, ద్వేషం అనే దిగ్భ్రాంతికరమైన నినాదాలు రాసి ఉన్నాయని ‘ది ఆస్ట్రేలియా టుడే’ నివేదించింది. ఈ ఘటన తరువాత బీఏపీఎస్ లక్ష్మీ నారాయణ్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ.. ఈ విధ్వంసక చర్యలకు, సంఘ వ్యతిరేక శక్తుల ద్వేషానికి తాము చింతిస్తున్నామని అన్నారు. శాంతి, సామరస్యం కోసం తాము ప్రార్థనలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై త్వరలోనే మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపారు. 

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి - అలహాబాద్ హైకోర్టు

హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్ర అధ్యక్షుడు మకరంద్ భగవత్ ‘ది ఆస్ట్రేలియా టుడే’తో మాట్లాడుతూ.. ప్రార్ధనా స్థలాలపై ఎలాంటి ద్వేష, విధ్వంస పూరిత చర్యలను సహించబోమని అన్నారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నామని తెలిపారు. ఇది జాతి, మత సహనం ఉల్లంఘన అని పేర్కొన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సమస్యను విక్టోరియన్ మల్టీకల్చరల్ కమిషన్, విక్టోరియా బహుళ సాంస్కృతిక మంత్రి దృష్టికి తీసుకువెళతామని ఆయన చెప్పారు.

ఈ సంఘటనపై ఉత్తర మెట్రోపాలిటన్ ప్రాంతానికి చెందిన లిబరల్ ఎంపీ ఇవాన్ ముల్హోలాండ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలోని శాంతియుత హిందూ సమాజానికి ఈ విధ్వంసం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి మత విద్వేషాలకు ఇక్కడ తావు లేదని తెలిపారు. 

అలహాబాద్ హైకోర్టు: ఇద్దరు ఉగ్రదాడి కేసు నిందితులకు బెయిల్..

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరి 12,16 తేదీలలో విక్టోరియాలోని కారమ్ డౌన్స్‌లోని పూజ్యమైన శ్రీ శివ విష్ణు దేవాలయం, మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసి ఉన్నాయి. గతేడాది కెనడాలోనూ హిందూ దేవాలయంపై దాడి జరిగింది.